‘అయోధ్య’ పిటిషన్ల విచారణకు బెంచ్‌ | Bench to inquire into 'Ayodhya' petitions | Sakshi
Sakshi News home page

‘అయోధ్య’ పిటిషన్ల విచారణకు బెంచ్‌

Published Tue, Aug 8 2017 1:08 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Bench to inquire into 'Ayodhya' petitions

న్యూఢిల్లీ: అయోధ్య–బాబ్రీ మసీదు వివాదంలో 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను సుప్రీం కోర్టు నియమించింది.

జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలో జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ల బెంచ్‌ ఈ నెల 11 నుంచి పిటిషన్ల విచారణ ప్రారంభిస్తుందని తెలిపింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని గతంలో సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహీ అఖరా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని గతంలో అలహాబాద్‌ హైకోర్టు 2:1 మెజారిటీతో తీర్పునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement