హైదరాబాద్: దేశ భద్రతను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భారత్ ఉనికి, మనుగడనే కాంగ్రెస్ సవాల్ చేస్తోందని దుయ్యబట్టారు. జేఎన్‌యూ ఘటనపై ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు జరపాలన్నారు. ఈ ఘటనలో అనేక తీవ్రవాద సంస్థలకు సంబంధాలు ఉన్నాయని మురళీధర్‌రావు ఆరోపించారు.
'దేశభద్రతను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ దిగజారింది'
Published Tue, Feb 16 2016 5:32 PM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM
Advertisement
Advertisement