jnu incident
-
'పై నుంచి ఆదేశాలు వస్తే పోలీసులేం చేయగలరు'
ఢిల్లీ : ఢిల్లీలోని జేఎన్‌యూ యునివర్సిటీలో ప్రొఫెసర్లు, విద్యార్థులపై జరిగిన దాడికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. జనవరి 5న జేఎన్‌యూలో హింసాత్మక వాతావరణం ఏర్పడినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. జేఎన్‌యూ ఘటనపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకపోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని తెలిపారు.(అసలేంటి ఇదంతా.. నాకేం అర్థం కావట్లేదు!) 'పై నుంచి ఆదేశాలు వస్తే ఢిల్లీ పోలీసులు మాత్రం ఏం చేయగలరు. జేఎన్‌యూలో ఎలాంటి హింస జరిగిన, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడినా మీరెంలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కేంద్రమే వారిని ఆదేశించింది. ఒకవేళ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను లెక్కచేయకుండా పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే వారిని సస్పెండ్ చేయడమో లేక ఉద్యోగాలు ఊడిపోవడమో జరిగేది' అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో జనవరి 5న హింస చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముసుగులు ధరించిన కొందరు దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, ప్రొఫెసర్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. వారి దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
జేఎన్‌యూ విద్యార్థులకు బెయిల్
రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్య లకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆరునెలల మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోర్టు రూ.25,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. జేఎన్‌యూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య ఫిబ్రవరి 24న పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కన్హయ్య కుమార్ తో పాటు జాతి వ్యతిరేక నినాదాలు చేశారని, అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా కన్హయ్య కుమార్ బెయిల్ పై బయటికి వచ్చిన రెండు వారాలకు వీరిద్దరికి బెయిల్ మంజూరైంది. మరో వైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయలేదు. -
ఆ ముగ్గురికి పటిష్ట భద్రత
న్యూఢిల్లీ: జేఎన్‌యూ ఘటనలో రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యతోపాటు రిమాండ్‌లో ఉన్న మరో ఇద్దరు విద్యార్థుల వివరాలపై గోప్యత పాటించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పటిష్టమైన భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులను కన్హయ్య బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించింది. దీంతో పాటు ఉమర్ , అనిర్బన్ భట్టాచార్యలు పటియాలా కోర్టుకు విచారణకు వస్తున్నప్పుడు తమకు రక్షణ కల్పించాలని కోరటంతో కోర్టు వద్ద భద్రతపై స్పష్టంగా ఉండాలని ఆదేశించింది. కన్హయ్య బెయిల్ పిటిషన్ తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది. కాగా ఉమర్, అనిర్బన్‌లను మూడురోజుల పోలీసు రిమాండ్‌ను తరలిస్తూ సిటీ కోర్టు ఆదేశించింది. కార్యక్రమాన్ని నిర్వహించింది కన్హయ్యే! అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని కన్హయ్యే నిర్వహించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అతనితోపాటు అరెస్టుచేసిన ఇద్దరు, మరికొందరు విదేశీయులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్నారు. కొత్త వీడియోలో బయటి వ్యక్తులు ఫిబ్రవరి 9న దేశ వ్యతిరేక నినాదాలు చేసింది బయటి వ్యక్తులేననే ఆధారాలతో కొత్త వీడియో తెరపైకి వచ్చింది. విదేశీ శక్తులు వీడియోలు ఉన్నాయంటూ పోలీసులు కోర్టుకు చూపించిన ఈ వీడియోతో కేసు కొత్త మలుపు తిరగనుంది. కాగా, లొంగిపోయిన ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను ఢిల్లీ పోలీసులు బుధవారం ఐదుగంటలపాటు ప్రశ్నించారు. ప్రభుత్వం భయపడుతోంది.. రాహుల్: జేఎన్‌యూ వివాదం విషయంపై పార్లమెంటులో తను లేవనెత్తే ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేక భయపడుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇదిలాఉండగా, జేఎన్‌యూలో విద్యార్థుల మెదళ్లను అక్కడి ప్రొఫెసర్లే కలుషితం చేస్తున్నారని మాజీ ఇన్ఫోసిస్ డెరైక్టర్ మోహన్దాప్ అన్నారు. కన్హయ్య, జర్నలిస్టులపై దాడికి యత్నించిన అడ్వకేట్ విక్రమ్ సింగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులపై కేసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ప్రొఫెసర్లు జేఎన్‌యూలో కాగడా ర్యాలీ నిర్వహించారు. క్యాండిల్ ర్యాలీ ఉద్రిక్తం న్యూఢిల్లీ: హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేములకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద జరిగిన కొవ్వొత్తుల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఈ ర్యాలీలో రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజా, విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ర్యాలీకి అనుమతి తీసుకోకపోవటంతో పోలీసులు అడ్డుకున్నారు. ‘అమ్మతోపాటు ర్యాలీలో పాల్గొన్న విద్యార్థినులను ఈడ్చేశారు’ అని రాజా తెలిపారు. వీరిని అరెస్టు చేసి తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు గంటసేపటి తర్వాత వదిలిపెట్టారు. ఢిల్లీకి రోహిత్ కుటుంబం మకాం ఢిల్లీలోనే నివాసముండాలని రోహిత్ తల్లి రాధిక తెలిపారు. రాజాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఢిల్లీ సర్కారు అంగీకరించటంతో.. త్వరలోనే ఢిల్లీకి మారతామన్నారు. రోహిత్ ఫెల్లోషిప్ ఆగడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని తెలపడంతో అప్లైడ్ జియాలజీలో పీజీ పూర్తిచేసిన రాజాకు ఉద్యోగం ఇస్తామని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారన్నారు. -
హస్తిన చిచ్చు దృష్టి మరల్చే ఉచ్చు
‘‘జిల్లా కలెక్టర్లను విమర్శిస్తే కూడా దానిని రాజద్రోహంగా పరిగణించాలనే స్థాయికి ఇండియన్ పీనల్ కోడ్ 124-ఏ అమలు దిగజారడం నాకు గుర్తున్నది. కానీ ఈ రోజు ప్రజల భావాలు మారిపోయాయి. మనం ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలనలోకి అడుగుపెడుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలపై విమర్శను, ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసే దేశ భద్రత సమస్యలను విడివిడిగా చూడాలి. అందువల్ల‘‘రాజద్రోహం’’ అనే పదాన్ని తొలగించాల్సిందిగా నేను కోరుతున్నాను. నిజానికి ప్రభుత్వం పట్ల విమర్శనాత్మకంగా ఉండడమే ప్రజాస్వామ్యం.’’ భారత రాజ్యాంగ రచనా సంఘం సభ్యులు కేఎం మున్షీ 1947లో వెలి బుచ్చిన అభిప్రాయాలు ఇవి. ఆయన సోషలిస్టు కాదు, కమ్యూనిస్టు అంత కన్నా కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి స్వతంత్ర పార్టీకి, ఆ తర్వాత జనసంఘ్‌కు మారినవారు. ఆ జనసంఘ్ పునాదుల మీదనే భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించిందని తెలిసిందే. ఆయన రాజకీయాలేవైనా, ఆయన మాటలు అంతా ఆలోచించాల్సినవి. రాజ్యాంగ సభలోప్రాథమిక హక్కులపై సుదీర్ఘ చర్చ జరిగిన తదుపరి రాజ్యాంగంలోని ఆర్టికల్-19 ప్రకారం భావప్రకటన స్వేచ్ఛను నిర్ధారించారు. ఈ సందర్భంగానే ఐపీసీ 124-ఏ సెక్షన్(రాజద్రోహం)పై కూడా చర్చ జరిగింది. ఈ సెక్షన్ కింద మొదట బ్రిటన్ రాణిని విమర్శిస్తే రాజద్రోహంగా పరిగణించేవారు. తదుపరి రాణి ప్రతినిధులపై విమర్శలకు కూడా ఈ చట్టాన్ని విస్తరింపజేశారు. ఆ తర్వాత దేశాన్ని విమర్శిస్తే కూడా రాజద్రోహమనే వరకు వెళ్లారు. గతంలో ఈ సెక్షన్ చాలా సార్లు దుర్వినియోగమైంది. ఇటీవల కూడా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే రాజద్రోహ నేరాన్ని విచ్చలవిడిగా ప్రయోగించారు. ఈ పరిణామాలను ఊహించే మున్షీ తదితరులు ఈ రాజద్రోహం అనే పదాన్ని తొలగించాలని కోరారు. కానీ అందుకు ఆమోదం లభించలేదు. దాని ఫలితా న్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. దానికి సాక్ష్యం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షులు కన్హయ్య కుమార్ అరెస్ట్. కన్హయ్య దేశద్రోహి అయితే బీజేపీనో? నిజానికి ఆర్టికల్-19లో పేర్కొన్న విధంగానే ‘‘భావప్రకటన, వాక్ స్వాతంత్య్రం, ఆయుధాల్లేని శాంతియుత సమావేశం’’ జేఎన్‌యూలో జరిగాయి. దానిని ధ్రువీకరిస్తూ హర్షిత్ అగర్వాల్ అనే జేఎన్‌యూ విద్యార్థి ఆ సంఘటన పూర్వాపరాలను తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఆయన కశ్మీర్ వేర్పాటువాదాన్ని సమర్థించడంలేదని, కానీ అటువంటి అభిప్రాయాలను విని, వాటిపై తన అభిప్రాయాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఆయన కథనం ప్రకారం... భారత పార్లమెంటుపై దాడికి కుట్రపన్నిన అభియోగానికి ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురు స్మారక సమావేశాన్ని ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఏర్పాటు చేసింది. విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షులు కన్హయ్యకుమార్‌తోపాటు ఎస్ఎఫ్ఐ, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసి యేషన్ల మద్దతును కోరగా వారు అంగీకరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) దీనిని వ్యతిరేకించి, సభకు అనుమతి ఇవ్వకూడదని యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చింది. అందువల్ల మైక్‌లు వినియోగించ రాదని విధించిన షరతుకు లోబడే సభను నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కశ్మీరీ విద్యార్థులంతా బయటి నుంచి వచ్చినవారే. కశ్మీరీ ఆజాదీ నినాదాలు చేసింది వారే తప్ప మిగతా విద్యార్థులెవ్వరూ కారు. హర్షిత్ ప్రత్యక్ష సాక్షిగా చెప్పిన విషయాలనే భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరిం చాయి. కన్హయ్య కుమార్‌కు, దేశ వ్యతిరేక నినాదాలకు ఏ సంబంధమూ లేదని వాళ్లు తేల్చి చెప్పారు. ఈ విషయాలు పత్రికల్లోనూ వచ్చాయి. కశ్మీర్ సమస్యపై భారత ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైన అక్కడి యువకుల్లో తీవ్ర నిరసన ఉన్నది. వారిని సమర్థిస్తున్న మేధావులు, జర్నలిస్టులు, రచయితలు దేశవ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. వాళ్ళు ఎన్నో సార్లు తమ అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించారు. మరి కశ్మీరీ ఆజాదీ జేఎన్‌యూలో మాత్రమే రాజద్రోహం ఎట్లా అయ్యిందో నేరం మోపిన వారే చెప్పాలి. అమెరికా సాగించిన వియత్నాం, ఇరాక్ యుద్ధాలకు వ్యతిరేకంగా వేలాది మంది అమెరికన్లు వీధుల్లో ప్రదర్శనలు చేశారు. పత్రికలు పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వెలువరించాయి. అమెరికా ప్రభుత్వం వారిపై దేశద్రోహం కేసులు పెట్టలేదు. కానీ అఫ్జల్ గురు ఉరిశిక్షను వ్యతిరేకిస్తున్న వాళ్లంతా దేశ ద్రోహులే అన్నట్టు కేంద్ర మంత్రులంతా మాట్లాడుతున్నారు. కానీ అఫ్జల్ గురు ఉరిశిక్షను వ్యతిరేకించిన వారిలో న్యాయకోవిదులు, న్యాయమూర్తులు, రచయితలు ఉన్నారు.‘‘సుప్రీంకోర్టు తీర్పు అంతిమం కారాదు, కాకూడదు. మరణశిక్షపై పునరాలోచించడానికి కావాల్సిన ఆధారాలున్నాయి’’ అని అఫ్జల్ గురు ఉరి సందర్భంగా బహిరంగంగా ప్రకటించిన ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షాను కూడా దేశద్రోహిగా పరిగణిస్తారా? అఫ్జల్‌గురు మరణశిక్షను కశ్మీర్‌లోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ‘‘న్యాయాన్ని అపహాస్యం చేయడం’’గా అభివర్ణించింది. ఆ పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేశారో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే చెప్పాలి. జేఎన్‌యూ ఘటనను చాకచక్యంగా వాడుకుంటున్నారు దేశ వ్యతిరేక నినాదాలను చేసిన వారిపై చర్య తీసుకోవాలని నిజంగానే భావిస్తే ఆ సభ వీడియో ద్వారా వారిని గుర్తించాల్సింది. కానీ ఆ పని చేయ లేదు. విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను అరెస్టు చేయడం వల్ల జేఎన్‌యూలో అశాంతి కలుగుతుందని, విద్యాలయం అట్టుడికి పోతుందని కేంద్రానికి తెలుసు. అయినా ఆ పనే చేసిందంటే ఒక విషయం స్పష్ట మౌతోంది. జేఎన్‌యూ ఘటనను బీజేపీ ప్రభుత్వం స్వీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూసినట్టు అర్థమవుతోంది. అంతేకాదు ఆ ఘటనను హింసాపూరితంగా చేయాలని, తమ పార్టీ ఎమ్మెల్యే ఓపీశర్మ నాయకత్వంలో విద్యార్థులపై, జర్నలిస్టులపై దాడి చేయించింది. ఆ విధంగా జేఎన్‌యూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశం అయ్యింది. ఈ ‘దేశద్రోహం’ చర్చ, ఉద్వేగాలు ఇంకా రేగాలనే తిరిగి మళ్లీ దాడి చేయించింది. మొత్తంగా ఈ ఉదంతంపై కేంద్ర వైఖరి రెండు ప్రయోజనాలను ఆశించింది. ఒకటి, జేఎన్‌యూలోని వామపక్ష, ప్రజాస్వామ్య విద్యార్థి శక్తులకు దేశద్రోహ ముద్రవేయడం, రెండవది, హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో ఊపందుకున్న కుల వ్యతిరేక ఉద్యమాన్ని దెబ్బకొట్టడం. తద్వారా విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న కులాధిపత్యాన్ని, కుల వివక్షను, కుల అణచివేతను మరుగునపడేసి, చర్చను పక్కదోవ పట్టించడం. అదేవిధంగా ప్రతిపక్షాలను ఇందులోకి లాగి దేశద్రోహం, దేశభక్తి మీద పార్లమెంటులో విభజన తీసుకొచ్చి పైచేయి సాధించాలన్నది ప్రభుత్వం ఆలోచన. మంగళవారం ప్రతిపక్షాలతో ప్రభుత్వం జరిపిన భేటీలో రోహిత్ మరణం చర్చకైనా రాకపోవడాన్ని బట్టి ఈ ఎత్తుగడ ఎంత పకడ్బందీగా, చాకచక్యంగా అమలైందో అర్థం అవుతుంది. అంతేకాదు పార్లమెంటులో ఈ అంశంపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించించగలిగింది. మరి రోహిత్ వేముల మరణంపై దేశవ్యాప్తంగా ఉద్యమం వెల్లువెత్తినా దానిపై చర్చకు అది ఎందుకు సిద్ధం కాలేదు? హెచ్‌సీయూలో తమ రాజకీయ జోక్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, తమ మంత్రులను కాపాడుకునేందుకే అనేది స్పష్టం. కేంద్రం ఉచ్చులో పడతారా? హెచ్‌సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ బలిదానంతో వెల్లువెత్తిన విద్యార్థి ఉద్యమం, జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్యపై రాజద్రోహం నేరం మోపిన కారణంగా రాజుకున్న విద్యార్థి ఉద్యమం రెండూ నిజానికి ఒకదానికొకటి స్ఫూర్తినందించాయి. కానీ జాతీయత, దేశద్రోహం అనే పదాల మాటున రోహిత్ ఉద్యమాన్ని మరుగుపర్చే కుట్ర కూడా జరిగింది. ఈ రెండు పదాల మాటున ఉన్న వెన్నుపోటు ఎత్తుగడను అర్థం చేసుకోకపోతే పాలకుల కుట్రలో ప్రతిపక్షాలూ పావులు కాకతప్పదు. అంటే పద్ధతి ప్రకారం, జేఎన్‌యూలో జరిగిన సమావేశాన్ని చాలా చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వం వాడుకోవాలని చూస్తున్నది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో రోహిత్ మరణంపై కేంద్రాన్ని నిలదీసి, రోహిత్ చట్టం కోసం పట్టుబడతామని హామీలిచ్చిన పార్టీలన్నీ అప్రమత్తతతో ఉండటం అవసరం. లేనట్టయితే బీజేపీ పన్నిన రాజకీయ ఉచ్చులో ప్రతిపక్షాలు పావులయ్యే ప్రమాదం ఉన్నది. అంత మాత్రాన జేఎన్‌యూ ఘటనను వదిలిపెట్టాలని కాదు. కోర్టుల సాక్షిగా ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడుతున్న మీడియాపై సైతం దాడులకు దిగిన ఫాసిస్టు రాజకీయాల నగ్నత్వాన్ని బట్టబయలు చేయడం కూడా తక్షణావసరమే. ‘‘విశ్వవిద్యాలయాలు కేవలం చదువుకు మాత్రమే పరిమితం కాకూ డదు. విద్యార్థులకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పాలి. విశ్వవిద్యాలయాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాథమికమైన అంశంగా ఉండాలి’’ అంటూ 2014 జూలైలో చికాగో విశ్వవిద్యాలయం ‘భావప్రకటనా స్వేచ్ఛ’పై ఒక డిక్లరేషన్‌ను ఆమోదించింది. దానిని అమెరికాలోని చాలా విశ్వవిద్యాలయాలు ఆమోదిం చాయి. విశ్వవిద్యాలయాల్లో విభిన్న అభిప్రాయాల మధ్య సంఘర్షణ ఉంటుం దని, దానిని అంగీకరించాలని కూడా చికాగో డిక్లరేషన్ స్పష్టం చేసింది. అదే విధంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయంగానీ, మద్రాస్ ఐఐటీ గానీ, ఢిల్లీ జేఎన్యూగానీ భావ సంఘర్షణలకు వేదికలుగా ఉన్నాయి. ప్రభుత్వాలు వాటిని గౌరవించాలి. అప్పుడు మాత్రమే దేశంలో నూతన ఆలోచనలకు ఒక అవకాశం ఉంటుంది. ‘‘నీవు చెప్పే దానితో నేను విభేదిస్తున్నాను. కానీ ఆ అభిప్రాయం చెప్పడానికి నీకున్న హక్కు కోసం నేను ప్రాణాలైనా ధార పోస్తాను’’ అన్న వోల్టేర్ మాటలను అర్థం చేసుకుని ఆచరించగలిగితేనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని కనుమరుగు కాకుండా కాపాడుకోగలుగుతాం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
'దేశభద్రతను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ దిగజారింది'
హైదరాబాద్: దేశ భద్రతను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత్ ఉనికి, మనుగడనే కాంగ్రెస్ సవాల్ చేస్తోందని దుయ్యబట్టారు. జేఎన్‌యూ ఘటనపై ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు జరపాలన్నారు. ఈ ఘటనలో అనేక తీవ్రవాద సంస్థలకు సంబంధాలు ఉన్నాయని మురళీధర్‌రావు ఆరోపించారు. -
రణరంగంగా మారిన పాటియాలా హౌస్ కోర్టు
-
కోర్టులో లాయర్ల వీరంగం
జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు,జర్నలిస్టులపై దాడులు, దుర్భాషలు ♦ దాడుల్లో స్వయంగా పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే ♦ పలువురు జర్నలిస్టులు, టీచర్లకు గాయాలు ♦ విద్యార్థి నేతపై రాజద్రోహం కేసు విచారణ సందర్భంగా ఘటన ♦ జేఎన్‌యూలో విద్యార్థుల స్ట్రైక్ న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదం మరింత తీవ్రమవుతోంది. అఫ్జల్ గురు ఉరిశిక్షకు వ్యతిరేకంగా వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంబంధించి జేఎన్‌యూ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై పెట్టిన రాజద్రోహం కేసు విచారణ సందర్భంగా సోమవారం పటియాలా కోర్టులో ఘర్షణ, దాడులు చోటు చేసుకున్నాయి. దేశభక్తులమని చెప్పుకుంటూ కొందరు న్యాయవాదులు కోర్టు లోపల, వెలపల జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులపై దాడులకు తెగబడ్డారు. మొదట కోర్టుహాల్లో జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు లక్ష్యంగా దాడి చేశారు. ‘దేశ వ్యతిరేకులను ఉత్పత్తి చేస్తున్న జేఎన్‌యూని మూసేయాలి. లాంగ్‌లివ్ ఇండియా’ అంటూ నినాదాలిచ్చారు. అక్కడే ఉన్న జర్నలిస్ట్‌లపైనా భౌతిక దాడికి పాల్పడ్డారు. తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నారంటూ.. ఎముకలు విరుగుతాయని తీవ్ర పదజాలంతో వారిని హెచ్చరించారు. కోర్టుహాల్ నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులను బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నించారు. మహిళలను నెట్టేశారు. అడ్డుకున్నవారిపై దాడికి దిగారు. మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. కోర్టు హాలు వెలుపల మరో బృందం లాయర్లు విద్యార్థులు, జర్నలిస్టులపై దాడికి దిగారు. ఈ దాడుల్లో 9మంది జర్నలిస్టులకు గాయాలైనట్లుగా తుగ్లక్‌రోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 10 మంది సహోద్యోగులకు గాయాలైనట్లుగా జేఎన్‌యూ ఉపాధ్యాయులు తెలిపారు. ‘జేఎన్‌యూ టీచర్లు కూడా దేశద్రోహులే’ అంటూ తమపై దాడి చేశారని రోహిత్ ఆజాద్ అనే టీచర్ పేర్కొన్నారు. ‘లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు కోర్టుహాల్లోకి రాగానే మొదట మమ్మల్ని తిట్టడం ప్రారంభించారు. ఆ తరువాత అకస్మాత్తుగా మమ్మల్ని బయటకు నెట్టేస్తూ, కొట్టసాగారు’ అని ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రీ తెలిపారు. కోర్టుహాల్లో భారీ సంఖ్యలో పోలీసులున్నప్పటికీ.. వారిని అడ్డుకోలేదన్నారు. వేరేపనిపై కోర్టుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ కూడా దాడుల్లో పాలు పంచుకున్నారు. సీపీఐ కార్యకర్త అమీఖ్ జమాయ్‌పై చేయి చేసుకున్నారు. అనంతరం వేరే కోర్టుహాళ్లో జరిగిన విచారణలో కన్హయ్యకుమార్ కస్టడీని మరో రెండు రోజుల పాటు కోర్టు పొడిగించింది. లష్కరేతో సంబంధం లేదు కాగా, జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద కార్యక్రమానికి ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాతో సంబంధం ఉన్నట్లుగా తమ విచారణలో తేలలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ స్పష్టం చేశారు. అయితే, ఆ కార్యక్రమంలో కన్హయ్య కుమార్ పాల్గొని, అభ్యంతరకర రీతిలో ప్రసంగించారని, అలాగే, దేశ వ్యతిరేక నినాదాలు చేశాడని పేర్కొన్నారు. రాజద్రోహం కేసులో ఆయనను అరెస్ట్ చేయడం సరైనదేనన్నారు. పటియాలా కోర్టులో జరిగింది చిన్నపాటి ఘర్షణ అని బస్సీ వ్యాఖ్యానించారు. ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదన్నారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం బస్సీ మీడియాకు ఈ వివరాలు తెలిపారు. కన్హయ్యపై రాజద్రోహం కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. రాహుల్ వర్సెస్ షా దేశ వ్యతిరేక నినాదాలు చేసిన దేశద్రోహులను సమర్ధిస్తున్నారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌పై బీజేపీ అధ్యక్షుడు అమిత్ ధ్వజమెత్తారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే.. దేశ విభజనను సమర్ధించడమని కాంగ్రెస్ భావిస్తోందా? అని సోనియాని ప్రశ్నించారు. ‘పాకిస్తాన్ జిందాబాద్.. గో ఇండియా గో బ్యాక్ అనే నినాదాలు, అఫ్జల్ గురును, కశ్మీర్ స్వాతంత్య్రాన్ని, కశ్మీర్లో వేర్పాటువాదాన్ని సమర్ధిస్తూ ఇచ్చిన నినాదాలను సమర్ధించడం చూస్తోంటే కాంగ్రెస్ నేత కశ్మీర్ వేర్పాటువాదులతో చేరిపోయారా అన్న అనుమానం కలుగుతోంద’ని వ్యాఖ్యానించారు. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురును సమర్థిస్తూ.. ఆ దాడిలో అమరులైన వారి కుటుంబాలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. షా వ్యాఖ్యలను రాహుల్ తిప్పికొడుతూ.. విభజన, విద్వేష ఎజెండాను బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ప్రోత్సహిస్తున్నాయని అస్సాంలో జరిగిన కార్యక్రమంలో అన్నారు. అందరి ఆలోచనలను నియంత్రించాలని, వారి అభిప్రాయాలను అందరిపై రుద్దాలని చూస్తోందన్నారు. దేశ సాంస్కృతిక వైవిధ్యంపై బీజేపీకి గౌరవం లేదన్నారు. బీజేపీకి ప్రతీ వర్సిటీలో ఉగ్రవాదులే కనిపిస్తున్నారంటూ మండిపడ్డారు. అది నకిలీ ట్వీట్: జేఎన్‌యూలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తన మద్దతుందంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను లష్కరే వ్యవస్థాపకుడు, జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ తోసిపుచ్చారు. ‘నా పేరుతో వచ్చిన ఒక నకిలీ ట్వీట్‌ను విశ్వసిస్తూ భారత హోంమంత్రి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరం’ అని యూట్యూబ్‌లో ఒక వీడియో సందేశాన్ని సయీద్ పోస్ట్ చేశారు. వివాదానికి రాజ్‌నాథ్ మతం రంగు పులుముతున్నారని కాంగ్రెస్ నేత మనీశ్ తివారి విమర్శించారు. వర్సిటీలో స్ట్రైక్ కన్హయ్య విడుదలయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. సోమవారం తరగతులను బహిష్కరించారు. వీరి ఆందోళనలకు సంఘీభావం ప్రకటించిన ఉపాధ్యాయులు మంగళవారం నుంచి సమ్మెలో పాల్గొననున్నారు. సమ్మెలు, ఆందోళనలతో వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయొద్దని వీసీ జగదీశ్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేసిన 8 మంది విద్యార్థుల వివరాలతో కూడిన స్థాయీ నివేదికను యూనివర్సిటీ కేంద్ర మానవ వనరుల శాఖకు పంపించింది. ఆ 8 మంది జాబితాలో కన్హయ్య పేరు ఉందా? లేదా? అనేది తెలియలేదు. ఏచూరికి బెదిరింపు కాల్స్ కన్హయ్య అరెస్టును నిరసిస్తున్న విద్యార్థులకు మద్దతిచ్చినందుకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం రాత్రి ఆమ్ ఆద్మీ బాలవీర్ సేన వారిగా చెప్పుకున్న వ్యక్తులు మూడు సార్లు ఫోన్స్ చేసి ఏచూరిని అంతు చూస్తామన్నారని పేర్కొన్నాయి. ఆదివారం సీపీఎం కార్యాలయంపై దాడిచేసింది బలవీర్ సేనే కావొచ్చన్నాయి. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, దర్యాప్తు జరుపుతున్నామని న్యూఢిల్లీ డీసీపీ తెలిపారు. వామపక్షాలను జాతివ్యతిరేకులుగా బీజేపీ పేర్కొనడంపై ఏచూరి మండిపడ్డారు. పోలీసుల అదుపులో గిలానీ ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఘటనకు సంబంధించి రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ అధ్యాపకుడు ఎస్ఏఆర్ గిలానీని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో విచారించారు. వెలుగులోకి మరో వీడియో న్యూఢిల్లీ: అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 9న జేఎన్‌యూ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కార్యక్రమంలో పాల్గొన్న ఒక బృందంలోని కొందరు దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్న దృశ్యం ఆ వీడియోలో ఉంది. ఆ బృందంలో కన్హయ్య కుమార్ కూడా ఉన్నట్లు అందులో ఉంది. అయితే, ఈ వీడియోలో ఆయన నినాదాలు చేస్తున్నట్లు ఎక్కడా లేదు. అలాగే, కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కొందరు విద్యార్థుల ఐడీ కార్డులను పోలీసులు పరిశీలిస్తున్న మరో దృశ్యంలోనూ కన్హయ్యకుమార్ ఉన్నారు. ముఖానికి అడ్డుగా సగం వరకు రుమాలు కట్టుకున్న ఒక వ్యక్తి ఆజాద్ కశ్మీర్ నినాదాలు చేస్తున్నట్లుగా అందులో కనిపిస్తోంది. ఆ వ్యక్తి ఎవరో ఇంతవరకు గుర్తించలేదని పోలీసులు తెలిపారు. -
లాయర్లే గూండాలుగా మారినవేళ...
పాటియాలా హౌస్ కోర్టు రణరంగంగా మారిపోయింది. జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంలో అక్కడ పలు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. అక్కడ అందరూ మాట్లాడుకుంటుండగా ఉన్నట్టుండి.. ''జేఎన్‌యూ వాళ్లు వచ్చారు.. వాళ్లను బయటకు తోసేయండి'' అంటూ అరుపులు వినిపించాయి. వెంటనే కొంతమంది న్యాయవాదులు లేచి, కోర్టు హాల్లోంచి జేఎన్‌యూ వాళ్లు వెళ్లిపోవాలని చెప్పారు. అయితే ఎందుకన్నది మాత్రం ఎవరికీ తెలియదు. పరిస్థితి విషమిస్తుండటంతో కొంతమంది జేఎన్‌యూ ప్రొఫెసర్లు అక్కడి నుంచి వెళ్లిపోడానికి సిద్ధమయ్యారు. అంతలోనే కొందరు లాయర్లు వచ్చి, వాళ్లతో గొడవపడ్డారు. జర్నలిస్టులను కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ లాయర్ దుస్తుల్లో ఉన్న కొంతమంది బెదిరించారు. ఏంటా అని చూసేలోపే పిడిగుద్దులు పడ్డాయి. కొంతమంది జర్నలిస్టులను మరికొందరు న్యాయవాదులు గుర్తించి.. వాళ్లను రక్షించారు. అప్పటికే పరిస్థితి బాగా విషమించింది. కోర్టు బయట నిల్చుని ఉన్న జర్నలిస్టులను కూడా జేఎన్‌యూ విద్యార్థులుగా భావించి వాళ్లను కొందరు లాయర్లు కొట్టారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గదిలో ఉన్న మహిళా రిపోర్టర్లను కూడా అక్కడినుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించారు. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ ఓ జేఎన్‌యూ విద్యార్థిని వెంటపడి తరుముకుంటూ బయటకు తీసుకెళ్లి కొట్టినట్లు కొందరు చెప్పారు. అయితే ఇంత జరుగుతున్నా ఢిల్లీ పోలీసులు మాత్రం మౌన ప్రేక్షకుల్లానే ఉండిపోయారని పలువురు బాధితులు ఆరోపించారు. మరికొందరు లాయర్లు 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు.