మంత్రి రాసలీలల వీడియో నా దగ్గరుంది: అనుపమ | i have the video of minister's love affair, says anupama shenoy | Sakshi
Sakshi News home page

మంత్రి రాసలీలల వీడియో నా దగ్గరుంది: అనుపమ

Published Thu, Jun 9 2016 4:40 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

మంత్రి రాసలీలల వీడియో నా దగ్గరుంది: అనుపమ

మంత్రి రాసలీలల వీడియో నా దగ్గరుంది: అనుపమ

కర్ణాటకలోని బళ్లారి జిల్లా కుదిల్గి డీఎస్పీగా రాజీనామా చేసిన అనుపమా షెనాయ్ ఆటం బాంబు పేల్చారు. ఐదు రోజుల పాటు ఎక్కడున్నారో కూడా తెలియని ఆమె.. గురువారం ఉదయం తిరిగొచ్చారు. కార్మిక శాఖ మంత్రి పరమేశ్వర నాయక్ తనను బెదిరించినప్పటి ఆడియో టేప్ తన వద్ద ఉం దని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆయనగారి రాసలీలల వీడియో కూడా ఉందని, మంత్రి ఆయన పదవి నుంచి తప్పుకొంటే తప్ప తన రాజీనామా ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేశారు. ఆడియో, వీడియోలను తగిన సమయంలో బయట పెడతానని చెప్పారు. అవినీతిపరులపై న్యాయపోరాటం చేస్తానన్నారు.

నాకు ఫేస్‌బుక్ అకౌంటే లేదు
ఈనెల 4వ తేదీన రాజీనామా చేసిన షెనాయ్ పేరుమీద వచ్చిన ఫేస్‌బుక్ పోస్టులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రాజకీయ దుమారం లేపాయి. కానీ, అసలు తనకు ఫేస్‌బుక్ అకౌంటే లేదని అనుపమా షెనాయ్ గురువారం వెల్లడించారు. తాను రాజీనామా చేయడానికి రాజకీయ ఒత్తిడి ఏమాత్రం కారణం కాదని, వ్యక్తిగత కారణాలతోనే తప్పుకొన్నానని అన్నారు. కొందరు వ్యక్తులు తన రాజీనామాను తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నారు. తన సోదరుడు అచ్యుత్ షెనాయ్‌తో కలిసి ఆమె పోలీసు క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఆమె ఎస్పీ లేదా మరే ఇతర అధికారులతో మాట్లాడలేదని, క్వార్టర్స్‌ లోపలే తలుపులకు గడియ పెట్టుకుని ఉన్నారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement