
పలుచోట్ల జయశంకర్ వర్ధంతి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర తెలంగాణ మంచ్ తరఫున తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొ. జయశంకర్ 3వ వర్ధంతిని ధారావి కుంబర్‌వాడ సుతార్ చర్చ్‌లో శనివారం ఉదయం 11 గంటలకు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ప్రొ. జయశంకర్ చిత్ర పటానికి అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక కార్యదర్శి మచ్చ ప్రభాకర్, మంచ్ అధ్యక్షుడు గుడుగుంట్ల వెంకటేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.
తర్వాత మంచ్ నాయకులు కార్యదర్శి కార్యవర్గం గొలుసుల లింగయ్య, కోశాధికారి ఆవుల రాములు, కార్యదర్శి సాకి శేఖర్, దూదిమెట్ల సైదులు, ఆర్గనైజర్ బత్తుల శంకర్, కారింగు అంజయ్య తదితరులు జయశంకర్‌కు నివాళులర్పించారు. 5 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తి జయశంకర్ అని రచయిత మచ్చ ప్రభాకర్ కొనియాడారు. ప్రతియేటా జయశంకర్ స్మృతి సభను జరుపుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో తమ మంచ్ పూర్తి క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
‘తెలంగాణ రత్న’ బిరుదునివ్వాలి..
సాక్షి, ముంబై: ప్రొఫెసర్ కె.జయశంకర్‌కు ‘తెలంగాణ రత్న’ బిరుదు ఇవ్వాలని ముంబై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), చెంబూర్ కార్మిక విభాగం డిమాండ్ చేశాయి. జయశంకర్ వర్ధంతి సందర్భంగా శనివారం వీరు సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌కు ‘తెలంగాణ రత్న’ బిరుదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముంబై టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి బల్లె శివరాజ్ , అధ్యక్షుడు బద్ది హేమంత్ కుమార్, చెంబూర్ కార్మిక విభాగం అధ్యక్షుడు చంద్ర గౌండ్, సుంక అంజయ్య, పి.దర్శయ్య, లక్ష్మి ఇమామి, పద్మ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఖార్ ప్రాంగణంలో..
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 3వ వర్ధంతిని తెలంగాణ కార్మిక సంఘం (బాంద్రా-ఖార్) ఆధ్వర్యంలో శనివారం ఖార్ ప్రాంగణంలో ఘనంగా జరుపుకున్నారు. జయశంకర్ చిత్రపటానికి నాకా కార్మికుల సమక్షంలో సంఘం పెద్దలు పుప్పాల పెద్ద సత్తయ్య, మచ్చ ప్రభాకర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రముఖులు కార్యవర్గం పిట్టల గణేష్, జట్టి కృష్ణ, గుండె చంద్రం, అంబల్ల యాదయ్య, రాంరెడ్డి, పోతుల రాములు తదితరులు పాల్గొన్నారు.