third death anniversary
-
అస్తిత్వ పతాక..ఆత్మగౌరవ ప్రతీక
జయశంకర్ మూడో వర్ధంతి సభలో కేసీఆర్ హైదరాబాద్‌లో భారీ విగ్రహం, స్మారకచిహ్నం హైదరాబాద్: తెలంగాణ అస్తిత్వ జయపతాక ఆచార్య జయశంకర్ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆచార్య జయశంకర్ మూడో వర్ధంతి సందర్భంగా తెలంగాణభవన్‌లో ఆయన విగ్రహానికి శనివారం పూల మాల వేసి కేసీఆర్ నివాళులర్పించారు. ఒకనాడు ఆత్మగౌరవంతో బతికి తర్వాత కోల్పోయిన అస్తిత్వం పునరుద్ధరణకోసం పోరాడిన జయశంకర్‌ను స్మరించుకోవడానికి ఎంత చేసినా తక్కువేనన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం తరపున భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యమైన స్థలంలో స్మారక చిహ్నాన్ని ఏర్పాటుచేయనున్నట్టు ఆయ న వెల్లడించారు. వరంగల్‌లోని ఏకశిలా పార్కును జయశంకర్ పేరిట మార్చనున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలో ఒక జిల్లాకు జయశంకర్ పేరును పెడతామని తెలిపా రు. జయశంకర్ సాహిత్యం, ఆలోచనావిధానం, పోరాటం, రచనలు, ఉపన్యాసాలు అందుబాటులో ఉన్నాయని చెప్పా రు. వీటిని విస్తృతం చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జయశంకర్ ఒక జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాదన్నారు. అణిచివేతకు గురైన ఒక జాతి పక్షానపోరాడిన జయశంకర్ యావత్‌దేశానికి ఆదర్శనీయుడని కేసీఆర్ కీర్తించారు. తెలంగాణకోసం 1952లో, 1969లో జరిగిన పోరాటాలతో పాటు ఇప్పుడు జరిగిన ఉద్యమాలను చూసిన జయశంకర్ ఇప్పుడు లేని లోటు తీరనిదన్నారు. తెలంగాణ ఏర్పాటైన ఈ తరుణంలో జయశంకర్ బతికి ఉంటే పునర్నిర్మాణంలో ఎంతో ఉపయోగకరంగా ఉండేదని కేసీఆర్ చెప్పారు. చిదంబరం ప్రకటనకు డ్రాఫ్టు జయశంకర్దే... తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టుగా 9 డిసెంబర్ 2009లో అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు సంబంధించిన ముసాయిదాను ఆచార్య జయశంకరే రాసినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు.ఎన్నో విపత్కర సమయాల్లో ఉద్యమాలకు ప్రాణంపోసిన జయశంకర్ వంటి మహనీయులు ప్రస్తుతం లేకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ అస్తిత్వం, భాష, యాస, జీవనసంస్కృతిపై జరి గిన దాడిని ఎన్నోసార్లు ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పారు. జయశంకర్‌కు నివాళులు అర్పించిన వారిలో పార్టీ సెక్రటరీ జరనల్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి, మంత్రులు కె.తారక రామారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జోగు రామన్న, ఎంపీ కె.కవిత, నేతలు పేర్వారం రాములు, కొండా సురేఖ, వ్యక్తిగత సహాయ కార్యదర్శి దేశపతి శ్రీనివాస్‌లు ఉన్నారు. -
జయశంకర్‌కు ఘననివాళి
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పట్టణంలో శనివారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ మూడో వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొని యాడారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని సంఘ భవనంలో జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవీంద్ర మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరువలేనిదని, తెలంగాణ జాతిపితగా ఆయన కీర్తి అందుకున్నారని పేర్కొన్నారు. సంఘం నాయకులు నరేందర్, విలాస్, యాదగిరి, మనోజ్, రాజు, భూపతి, సుజీత్, నారాయణ, రమేశ్ పాల్గొన్నారు. టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో.. టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని సంఘ భవనంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లచ్చిరాం మాట్లాడుతూ రాష్ట్రంలో అందరూ సుఖసంతోషాలతో ఉన్నప్పుడే జయశంకర్‌కు నిజమైన నివాళి అర్పించినట్లు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు నారాయణరెడ్డి, కార్యదర్శి రాంరెడ్డి, వివిధ మండలాల నాయకులు రామకృష్ణ, వినోద్‌రెడ్డి, భీంరావు, కిషన్, నానాజీ, గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పలుచోట్ల జయశంకర్ వర్ధంతి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర తెలంగాణ మంచ్ తరఫున తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొ. జయశంకర్ 3వ వర్ధంతిని ధారావి కుంబర్వాడ సుతార్ చర్చ్‌లో శనివారం ఉదయం 11 గంటలకు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ప్రొ. జయశంకర్ చిత్ర పటానికి అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక కార్యదర్శి మచ్చ ప్రభాకర్, మంచ్ అధ్యక్షుడు గుడుగుంట్ల వెంకటేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత మంచ్ నాయకులు కార్యదర్శి కార్యవర్గం గొలుసుల లింగయ్య, కోశాధికారి ఆవుల రాములు, కార్యదర్శి సాకి శేఖర్, దూదిమెట్ల సైదులు, ఆర్గనైజర్ బత్తుల శంకర్, కారింగు అంజయ్య తదితరులు జయశంకర్‌కు నివాళులర్పించారు. 5 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తి జయశంకర్ అని రచయిత మచ్చ ప్రభాకర్ కొనియాడారు. ప్రతియేటా జయశంకర్ స్మృతి సభను జరుపుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో తమ మంచ్ పూర్తి క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ‘తెలంగాణ రత్న’ బిరుదునివ్వాలి.. సాక్షి, ముంబై: ప్రొఫెసర్ కె.జయశంకర్‌కు ‘తెలంగాణ రత్న’ బిరుదు ఇవ్వాలని ముంబై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), చెంబూర్ కార్మిక విభాగం డిమాండ్ చేశాయి. జయశంకర్ వర్ధంతి సందర్భంగా శనివారం వీరు సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌కు ‘తెలంగాణ రత్న’ బిరుదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముంబై టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బల్లె శివరాజ్ , అధ్యక్షుడు బద్ది హేమంత్ కుమార్, చెంబూర్ కార్మిక విభాగం అధ్యక్షుడు చంద్ర గౌండ్, సుంక అంజయ్య, పి.దర్శయ్య, లక్ష్మి ఇమామి, పద్మ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఖార్ ప్రాంగణంలో.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 3వ వర్ధంతిని తెలంగాణ కార్మిక సంఘం (బాంద్రా-ఖార్) ఆధ్వర్యంలో శనివారం ఖార్ ప్రాంగణంలో ఘనంగా జరుపుకున్నారు. జయశంకర్ చిత్రపటానికి నాకా కార్మికుల సమక్షంలో సంఘం పెద్దలు పుప్పాల పెద్ద సత్తయ్య, మచ్చ ప్రభాకర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రముఖులు కార్యవర్గం పిట్టల గణేష్, జట్టి కృష్ణ, గుండె చంద్రం, అంబల్ల యాదయ్య, రాంరెడ్డి, పోతుల రాములు తదితరులు పాల్గొన్నారు.