ఇస్రో క్రయోజెనిక్ అదుర్స్ | ISRO's Cryogenic Adhurs | Sakshi
Sakshi News home page

ఇస్రో క్రయోజెనిక్ అదుర్స్

Published Mon, May 4 2015 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

ఇస్రో క్రయోజెనిక్ అదుర్స్

ఇస్రో క్రయోజెనిక్ అదుర్స్

సత్తా చాటుతున్న ఇంజిన్
 
సూళ్లూరుపేట/బెంగళూరు: నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలను సైతం అంతరిక్షానికి మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్‌లో అమర్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన క్రయోజెనిక్ ఇంజిన్ వరుస పరీక్షల్లో సత్తా చాటుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధిపరుస్తున్న ఈ ‘హై థ్రస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్’లో 20 టన్నుల క్రయో ఇంధనాన్ని నింపి ఇస్రో ఏప్రిల్ 28న 635 సెకన్ల పాటు హాట్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లో కీలకమైన ఈ ఇంజన్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు తమిళనాడులోని మహేంద్రగిరిలో గల ప్రొపల్షన్ సెంటర్‌లో ఇస్రో వరుసగా పరీక్షలు నిర్వహిస్తోంది.


ఇంజన్‌కు చెందిన థ్రస్ట్ చాంబర్, ఇంజెక్టర్, గ్యాస్ జెనరేటర్, టర్బో పంపులు, నియంత్రణ పరికరాలన్నీ పరీక్షల్లో బాగా పనిచేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ ఇంజన్ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు వరుసగా రకరకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కాగా, 4 టన్నుల బరువైన ఉపగ్రహాలను భూస్థిర కక్ష్యకు చేర్చడంతో పాటు మానవ సహిత అంతరిక్ష యాత్రలకూ ఉపయోగపడేలా జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్‌ను తయారు చేసిన ఇస్రో ఇదివరకే దానిని విజయవంతంగా పరీక్షించింది. అయితే, అందులో క్రయోజెనిక్ ఇంజిన్ లేకుండానే ఆ ప్రయోగం నిర్వహించింది. ఈ ఇంజిన్ పూర్తిగా సిద్ధమైతే గనక.. అంతరిక్ష ప్రయోగాల్లో క్రయోజెనిక్ టెక్నాలజీని సొంతంగా వినియోగించే ఆరో దేశంగా భారత్ నిలవనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement