కాజోల్ కు ప్రభుత్వ పదవి | Kajol appointed part-time member of Prasar Bharati board | Sakshi
Sakshi News home page

కాజోల్ కు ప్రభుత్వ పదవి

Published Fri, Feb 19 2016 8:05 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

కాజోల్ కు ప్రభుత్వ పదవి

కాజోల్ కు ప్రభుత్వ పదవి

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కాజోల్ కు ప్రభుత్వ పదవి దక్కింది. ప్రసారభారతి బోర్డులో స్వల్పకాలిక(పార్ట్ టైమ్) సభ్యురాలిగా ఆమె నియమితులయ్యారు. 2021 నవంబర్ వరకు ఈ పదవిలో ఆమె కొనసాగుతారని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నెల 24న జరగనున్న ప్రసారభారతి బోర్డు సమావేశానికి ఆమె హాజరయ్యే అవకాశముందని తెలిపారు. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సమావేశంలో కీలక విషయాలు చర్చించనున్నారు.

కాజోల్ పాటు ఆన్‌లైన్ మీడియా రంగంలో విశేష అనుభవం కలిగిన శశి శేఖర్‌ వేంపాటి కూడా స్వల్పకాలిక సభ్యుడిగా నియమితులయ్యారు. ప్రసార భారతి ఉపాధ్యక్షుడు హమీద్‌ అన్సారీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ నెల రెండవ వారంలోనే వీరి పేర్లు ఖరారు చేసింది. ప్రసారభారతి తాత్కాలిక బోర్డులో ఆరుగురు సభ్యులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement