రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ!
స్వదేశంలో ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 'ద మేక్ ఇన్ ఇండియా వీక్' వారోత్సవాలతో దాదాపు రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీలు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్రం తెలిపింది. మొత్తం రూ. 15,20,000 కోట్ల పెట్టుబడులకు హామీలు ఇ్చారని కేంద్ర పారిశ్రామిక విధానం, ప్రమోషన్ శాఖ తెలిపింది. వివిధ సమావేశాలకు మొత్తం 8.90 లక్షల మంది సందర్శకులు వచ్చారని, ఇక మహారాష్ట్ర దేశానికే గేట్‌వేగా మారుతుందని తెలిపారు.
పెట్టుబడులలో దాదాపు సగానికి పైగా మహారాష్ట్ర నుంచి వచ్చినవేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఈ వారోత్సవాల్లో తమ ప్రభుత్వం దాదాపు రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఎంఓయూలు చేసుకుందని తెలిపారు. మొత్తం పెట్టుబడుల్లో 30 శాతం విదేశాల నుంచి వచ్చినవి. 2016, 2017 సంవత్సరాల్లో భారత జీడీపీ వృద్ధిరేటు దాదాపు 7.5 శాతం వద్ద స్థిరంగా ఉండొచ్చని అమెరికా ఏజెన్సీ మూడీస్ తెలిపింది.