మోదీతో సెల్ఫీకి తారల పోటీ | Modi selphu with the stars of the competition | Sakshi
Sakshi News home page

మోదీతో సెల్ఫీకి తారల పోటీ

Published Mon, Oct 27 2014 1:56 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మోదీతో సెల్ఫీకి తారల పోటీ - Sakshi

మోదీతో సెల్ఫీకి తారల పోటీ

ముంబై: అందరూ సినిమా తారలతో ఫొటోలు దిగేందుకు ఇష్టపడితే.. బాలీవుడ్ తారలు మాత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ఫొటోలు దిగేందుకు క్యూలు కడుతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సోనమ్ కపూర్, శ్రద్ధా కపూర్ శనివారం ముంబైలో మోదీతో కలసి సెల్ఫీ తీసుకొని సంబరపడిపోయారు. సోనమ్  ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సెల్ఫీ తీసుకొని ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. శ్రద్ధా ‘ఆషిఖి 2’లో సహనటుడు ఆదిత్యారాయ్ కపూర్‌తో కలిసి మోదీతో సెల్ఫీ తీసుకున్నారు. ‘మన ప్రియమైన ప్రధానితో కలిసే అమూల్యమైన అవకాశం దక్కింది’ అని కాంక్షిస్తూ శ్రద్ధా ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు.  గాయకుడు సోనూ నిగమ్ కూడా మోదీతో సెల్ఫీ తీసుకున్నాడు.

హృతిక్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు

‘స్వచ్ఛభారత్’కు చక్కని ప్రచారం అందిస్తూ అందులో భాగస్వాముడవుతున్నందుకు ‘బాలీవుడ్’ నటుడు హృతిక్ రోషన్‌పై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. హృతిక్ ముంబై జుహు వీధిలో చేపట్టిన పరిశుభ్రతా కార్యక్రమాన్ని ఫొటోలతో సహా ట్విట్టర్‌లో ఉంచడంతో దానిపై ప్రధాని ట్వీట్ చేశారు. హృతిక్  చూపిన చొరవ ఎంతో మందిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement