రాకుమారి త్రిశికా కుమారి, యువరాజు యదువీర్
సాక్షి, బెంగళూరు: మైసూరు రాజవంశానికి చెందిన యువరాజు యదువీర్‌కృష్ణదత్త చామరాజ ఒడయార్ త్వరలో పెళ్లి కొడుకు కానున్నారు. రాజస్తాన్ రాజవంశానికి చెందిన రాకుమారి త్రిశికా కుమారితో జూన్ 27న యువరాజు వివాహం జరగనుంది.
మైసూరులో ఇరు రాజకుటుంబ సభ్యుల సమక్షంలో, పురోహితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ సోమవారం నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. వివాహ మహోత్సవాన్ని జూన్ 22 నుంచి ఐదు రోజుల పాటు మైసూరులోని రాజప్రాసాదంలో నిర్వహించనున్నట్లు రాజకుటుంబ వర్గాలు తెలిపాయి.