mysore prince
-
త్రిశికాతో యువరాజు వివాహం
సాక్షి, బెంగళూరు: మైసూరు రాజవంశానికి చెందిన యువరాజు యదువీర్కృష్ణదత్త చామరాజ ఒడయార్ త్వరలో పెళ్లి కొడుకు కానున్నారు. రాజస్తాన్ రాజవంశానికి చెందిన రాకుమారి త్రిశికా కుమారితో జూన్ 27న యువరాజు వివాహం జరగనుంది. మైసూరులో ఇరు రాజకుటుంబ సభ్యుల సమక్షంలో, పురోహితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ సోమవారం నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. వివాహ మహోత్సవాన్ని జూన్ 22 నుంచి ఐదు రోజుల పాటు మైసూరులోని రాజప్రాసాదంలో నిర్వహించనున్నట్లు రాజకుటుంబ వర్గాలు తెలిపాయి. -
కమలదళంలోకి యువరాజు...
సాక్షి, బెంగళూరు/మైసూరు: మైసూరు యదువంశ యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ భారతీయ జనతా పార్టీలోకి చేరనున్నారా? అంటే రాష్ట్ర బీజేపీ నాయకులు అవుననే అంటున్నారు. యువరాజు కమలదలంలోకి చేరడానికి ప్రధాని నరేంద్రమోదీ సైతం అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మైసూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన నరేంద్రమోదీ స్థానిక లలిత్‌మహల్ హోటల్లో బస చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయమే రాజమాత ప్రమోదా దేవి తమ దత్త కుమారుడు యదువీర్‌తో కలిసి ప్రధాని న రేంద్రమోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమయంలో యదువీర్ తాను బీజేపీలోకి చేరి దేశానికి సేవ చేయాలనిభావిస్తున్నట్లు మోదీతో పేర్కొన్నారు. ఇందుకు నరేంద్రమోదీ తన సమ్మతిని తెలియజేశారు. ఇదిలా ఉండగా గతంతో యదువీర్ తాను త్వరలోకి రాజకీయాల్లోకి రానున్నట్లు బహిరంగంగానే పేర్కొన్న విషయం ఇక్కడ గమనార్హం. ఆ యువకుడు మోదీ అభిమానే... ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్‌ను అడ్డగించిన యువకుడు మైసూరు తాలూకాలోని వరకూడు గ్రామానికి చెందిన వినయ్ అని తెలిసింది. దేశ శ్రేయస్సు కోసం తాను రూపొందించిన ఓ ప్రాజెక్టును మోదీకి వివ రించడానికే కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లినట్లు పోలీసు విచారణలో ఇప్పటి వరకూ తేలింది. వివరాలు... మైసూరులో శనివారం రాత్రి జరిగిన కార్యక్రమాలను ముగించుకుని స్థానిక హోటల్‌కు వెలుతున్న మోదీ కాన్వాయ్‌కు ఓ యువకుడు అడ్డుగా వెళ్లిన విషయం తెలిసిందే. వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు వినయ్ తెలిపిన వివరాలను అనుసరించి... మైసూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిప్లొమో చదువతున్న వినయ్ స్వతహాగా నరేంద్రమోదీ అభిమాని. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో ఆకర్షితుడై తాను కూడా దేశ శ్రేయస్సుకోసం ఏమైనా చేయాలని నిత్యం తల్లిదండ్రులతో చెప్పేవారు. ఈ క్రమంలోనే దేశంలో పచ్చదనాన్ని పెంపొందించే ఉద్దేశంతో ‘గ్రీన్ ఇండియా’ పేరుతో ఓ ప్రాజెక్టును రూపొందించారు. సదరు ప్రాజెక్టు గురించి వివరించడానికి ప్రధానిని కలవాలనుకున్నా వీలు పడలేదు. దీంతో వినయ్ మోదీ కాన్వాయ్ృు అడ్డుగా వెళ్లి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కలిగిన బ్యాగ్‌ను మోదీ ప్రయాణిస్తున్న కారు పైకి విసిరాడు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ప్రధాని కాన్వాయ్‌కు అడ్డుతగిలిన వినయ్‌ను పోలీసుల విచారణ చేస్తున్నారు.