సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్ధల(పీఎస్‌యూ)కు సంబంధించి చేపట్టాల్సిన బకాయిలన్నింటినీ అక్టోబర్ 15 నాటికి పూర్తిగా చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పీఎస్‌యూ అధిపతులతో జరిగిన భేటీ అనంతరం ఆమె ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వ ఏజెన్సీలు, పీఎస్‌యూలకు అందించిన సేవలు, వస్తువుల సరఫరా మరే ఇతర పనులకు సంబంధించి పెండింగ్ బకాయిలను అక్టోబర్ 15లోగా క్లియర్ చేస్తామని మంత్రి వెల్లడించారు. కాగా ఈ సమావేశంలో ఆయిల్ ఇండియా, ఎన్‌హెచ్‌ఏఐ, హాల్, ఎన్‌హెచ్‌పీసీ, ఇండియన్ ఆయిల్, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్, గెయిల్, హెచ్‌పీసీఎల్, హిందుస్తాన్ పెట్రోలియం తదితర పీఎస్‌యూల అధిపతులు, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment