
కేంద్రమంత్రి గడ్కరికి తప్పిన ప్రమాదం
కోల్కతా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బుధవారం పశ్చిమబెంగాల్ పర్యటనకు వెళ్లిన గడ్కరీ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ల్యాండ్ అవుతున్న సమయంలో హెలీకాప్టర్కు కార్పెట్లు తగిలాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.