ప్రశాంత్ భూషణ్‌కు సీబీఐ చీఫ్ డిమాండ్
న్యూఢిల్లీ: తన నివాసానికి వచ్చి వెళ్లినవారి వివరాలుండే సందర్శకుల జాబితాను న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు అందజేసిన ‘ప్రజా వేగు’ ఎవరో బయటపెట్టాలని సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హా డిమాండ్ చేశారు. ఆ ప్రజావేగు పేరు బయటపెట్టకుండా ఉండేందుకు కావాల్సిన రక్షణ తనకుందని భూషణ్ తప్పించుకోజాలరని అన్నారు. 2జీ కేసులో నిందితులు సీబీఐ చీఫ్‌తో ఆయన ఇంట్లో చాలాసార్లు సమావేశమయ్యారని, దీనికి సందర్శకుల జాబితాయే నిదర్శనమని, ఆయన్ను 2జీ కేసు నుంచి తప్పించాలని భూషణ్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
దీనికి కౌంటర్‌గా సుప్రీంకోర్టులో రంజిత్ సిన్హా శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేశారు. తన నివాస సందర్శకుల రిజిస్టర్ ఎక్కడి నుంచి సంపాదించారో చెప్పకుండా కేసును వాదించడం తన న్యాయవాదికి వీలుకాదన్నారు. ఆ ప్రజావేగుకు ఎవరినుంచైనా ప్రాణహాని ఉన్నప్పుడు మాత్రమే పేరు వెల్లడించకుండా ఉండే రక్షణ ఉంటుందని, ఈ కేసులో ఆ పరిస్థితి లేద న్నారు.
‘ప్రైవసీ గురించి మాట్లాడలేరు’
కాగా, ఒక ప్రభుత్వ అధికారి అన్నివేళల్లో ప్రైవసీ హక్కు గురించి మాట్లాడటం కుదరదని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జీఎస్ సింఘ్వీ అన్నారు. తన ఇంటి సందర్శకుల వ్యవహారంపై రంజిత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు.
జాబితా ఇచ్చిందెవరో చెప్పాల్సిందే!
Published Sun, Sep 14 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM
Advertisement
Advertisement