న్యూఢిల్లీ: సైనికులు ధరించే దుస్తులు, షూస్, బ్యాడ్జీలు వంటి వాటిని బయట ప్రదేశాల్లో అమ్మడం తీవ్రమైన విషయమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలా అమ్ముతున్న దుస్తులను ఉపయోగించి సైనిక స్థావరాలపై తీవ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని, వీటిపై తమ వైఖరి తెలియజేయాల్సిందిగా హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఢిల్లీకి చెందిన ఎన్‌జీవో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం వాదనలు వినింది. అనంతరం దీనిపై తమ వైఖరిని తెలియజేయాలని రక్షణ శాఖ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి వాదనలను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది.
బహిరంగంగా సైనికుల దుస్తుల అమ్మకాలా?
Published Wed, Dec 7 2016 3:51 PM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM
Advertisement
Advertisement