ముజఫర్‌నగర్: ఢిల్లీ-హరిద్వార్ నేషనల్ హైవేపై రోడ్డు దాటే విషయంలో రెండు వర్గాలకు చెందిన శివ భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. జిల్లాలోని సిసోనా గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు కావడ్ యాత్రికులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రోడ్డు దాటే విషయంలో ఈ ఘర్షణ జరిగిందని వివరించారు. ఈ గొడవను నియంత్రించేందుకు స్వల్ప లాఠీ చార్జీ చేయాల్సి వచ్చిందని తెలిపారు.
నలుగురు యాత్రికులు అంకూర్, కుల్దీప్, సందీప్, సోనూలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రతియేటా హరిద్వార్‌లోని గంగా నదిలో పవిత్ర స్నానం చేసి భక్తులు కావడీలో నీటిని తీసుకెళ్లి సొంతూర్‌లోని శివునికి పూజలు చేయడం అనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.