
యునిసెఫ్ అంబాసిడర్‌గా సూపర్ ఉమన్
న్యూఢిల్లీ: యునిసెఫ్ గ్లోబల్ గుడ్‌విల్ అంబా సిడర్‌గా యూట్యూబ్ స్టార్, సూపర్ ఉమన్‌గా ఖ్యాతి గడించిన భారత సంతతికి చెందిన కెనడా యువతి లిల్లీ సింగ్ (28) నియమితులయ్యారు. ‘గర్ల్ లవ్’ పేరుతో లిల్లీ సింగ్ బాలల హక్కులపై అనేక రకాల వీడి యోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి లక్షలాది మందికి చేరువయ్యారు. యునిసెఫ్ ‘యూత్ ఫర్ చేంజ్’ కార్యక్రమంలో భాగంగా బాల కార్మిక వ్యవస్థ, లింగ సమానత్వం సమస్యలపై అవగాహన కల్పించనున్నారు.