యెమెన్‌లో అల్ కాయిదా ఉగ్రవాదులుగా భావిస్తున్న దుండగులు శుక్రవారం జరిపిన దాడుల్లో 56 మంది జవాన్లు మృతిచెందారు.
సనా: యెమెన్‌లో అల్ కాయిదా ఉగ్రవాదులుగా భావిస్తున్న దుండగులు శుక్రవారం జరిపిన దాడుల్లో 56 మంది జవాన్లు మృతిచెందారు. వీరిలో కొందరు పోలీసులు ఉన్నారు. ముష్కరులు మూడు చోట్ల ఏకకాలంలో దాడులు చేశారని అధికారులు తెలిపారు. అల్‌కాయిదాకు పట్టున్న షాబ్వా రాష్ట్ర రాజధాని అతాక్‌లో చమురు బావులకు రక్షణగా ఉన్న సైనిక స్థావరంలోకి పేలుడు పదార్థాల వాహనంలో వెళ్లిన ఆత్మాహతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడని, ఈ ఘటనలో 38 మంది సైనికులు చనిపోయారని వెల్లడించారు.