అసోం: అసోంలోని సోనిట్ పూర్, కొక్రాఝర్ జిల్లాలో ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి 55కి పెరిగింది.మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. అసోంలో ఉగ్రవాదుల దాడికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఖండించారు. ఉగ్రవాద దాడులను తక్షణం అరికట్టాలని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో అసోంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటిచింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం అసోంలో పర్యటించనున్నారు. బోడో తీవ్రవాదు నరమేధానికి పాల్పడిన ప్రాంతాలను రాజ్నాథ్ సందర్శించనున్నారు.
సోంత రాష్ట్రం కోసం గత దశాబ్దకాలంగా బోడో తీవ్రవాదులు పోరాటం చేస్తున్నారు. అయితే వారి ఏరివేతకు సైనిక చర్యలు చేపట్టారు. అందులోభాగంగా బోడో తీవ్రవాదులు చాలా నష్టపోయారు. ఇటీవల సైనికుల ఎదుర కాల్పుల్లో ఇద్దరు బోడో తీవ్రవాదులు మరణించారు. దాంతో తీవ్రవాదల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సైనికులకు గిరిజనులు సహకరిస్తున్నారని అనుమానించిన తీవ్రవాదులు ఆదివారం రాత్రి సోనిట్ పూర్, కొక్రాఝర్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు. ఆ ఘటనలో 38 మంది మరణించారు.