
ముంబై : ఉత్తర ముంబై లోక్‌సభ స్ధానం నుంచి సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళా మటోండ్కర్ తనకు సాయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బాలీవుడ్ ఫ్రెండ్స్ పలువురు ముందుకొచ్చారని చెప్పారు. అయితే వీరందరిలో ఎంతమంది ప్రచారంలో పాల్గొంటారో చూడాలని రంగీలా నటి అన్నారు.
తనకు మద్దతుగా ఏ కొద్ది మంది ప్రచారంలో పాల్గొన్నా సంతోషమేనని, వారు ప్రచారంలో పాల్గొనకపోయినా మంచిదేనని చెప్పుకొచ్చారు. ఉత్తర ముంబై నియోజకవర్గం నుంచి పోటీలో దిగిన ఊర్మిళ ఎన్నికల ప్రచారం చేపట్టారు. పలు ప్రార్ధనా స్ధలాలనూ ఆమె సందర్శించారు. రాజకీయ ప్రస్ధానం ఇప్పుడే మొదలైందని, తనకింకా విసుగు రాలేదని చెప్పారు. సినీ రంగంలోనూ తాను ఎంతో కష్టపడి పేరుతెచ్చుకున్నానని, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తానని అన్నారు. నిజాయితీతో పనిచేయడమే తన విలక్షణతని ప్రజలు తనను ఎన్నుకుంటే వారికి నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment