
ములాయం కొడుకు గోశాలకు సీఎం యోగి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్నకుమారుడు ప్రతీక్ యాదవ్ ఇంటికి వెళ్లనున్నారు. ప్రతీక్ యాదవ్ నిర్వహిస్తున్న కన్హా ఉపవాన్(గోశాల)ను సందర్శించనున్నారు. ఇందులో ప్రతీశ్ చాలా గోవులను సాకుతూ పెద్ద గోశాలగా మార్చారు. సహజంగానే సన్యాసి అయిన యోగి ఆదిత్యానాథ్‌కు గోవులంటే అమితమైన ప్రేమ. వాటిని హింసించేవారంటే ఆయనకు ఏ మాత్రం నచ్చదు. గోవును మాతగా ఆయన భావిస్తుంటారు.
ఈ నేపథ్యంలో గొప్ప గోశాల అయిన కన్హా ఉపవాన్‌ను యోగి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రతీక్, ఆయన భార్య అపర్ణా యాదవ్‌తోపాటు ములాయం సింగ్ సింగ్ ఆయన భార్య సాధనా యాదవ్ కూడా అక్కడికి వెళ్లి ముఖ్యమంత్రి యోగిని కలిసి శుభాభినందనలు తెలియజేయనున్నారు. శుక్రవారం పదిగంటల ప్రాంతంలో కన్హా ఉపవాన్‌ను యోగి సందర్శించే అవకాశం ఉంది. గోశాలను సందర్శించిన తర్వాత ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన 20 నిమిషాలపాటు ప్రతీక్ దంపతులు తదితరులతో భేటీ అయ్యే అవకాశం ఉంది.