మా పదకోశం మాదే!
ఇద్దరివీ వజ్ర సంకల్పాలే. అదేదో కథలో చెప్పినట్టు- యజ్ఞజలంలో తడిసిన ముంగిస ఒక్కసారి బంగరు ముంగిస అయిపోయిందట. వీటిలో ఏ ఒక్కరి వజ్ర సంకల్పం ఫలించినా చాలు. ఎందుకంటే బోర్డర్ జిల్లాల మీద ఉభయ సంకల్పాలలో కామన్‌గా ఉన్న గోల్డ్ ప్రభావం పడి తీరుతుంది. అది చాలదా సామాన్యుడి బతుక్కి!
విద్యార్థి పరీక్ష రాసేట ప్పుడు గుర్తు చేసుకోవడం ఉంటుంది కానీ, ఆలో చించడం ఉండదు. సొంతంగా ఆలోచించి లెక్కలు, సైన్సు, గ్రామ రు కనీసం సోషల్ గాని రాయలేడు కదా! అస లు చదివి ఉంటే కదా గుర్తుకు రావడానికి! అయితే ఇప్పుడు మీరేవం టారు? బడ్జెట్‌కి ముందు మానిఫెస్టో మేం చదవలేదంటారా? ఊరికే కాకుల్లాగా అరవద్దు.
‘‘మమ్మల్ని కాకులంటారా?’’
‘‘లోకులు పలుగాకులు అన్నాడు శాస్త్రకారుడు. కాకుంటే ప్రతిపక్షులని అర్థం’’
‘‘కుక్కలు అని కూడా సెలవిచ్చారు’’
‘‘ఔను. ఇచ్చాను. విశ్వాసానికి కుక్క మారు పేరు. ఓటిచ్చిన విశ్వాసంతో మీ మాన ధన భద్ర తకు అయిదేళ్లు రేయింబవళ్లు కుక్క కాపలా కాస్తా నన్నాడొక మంత్రిగారు. అందాకా దేనికి ఒక బ్యాం కు తమ చిహ్నంగా కుక్క బొమ్మని పెట్టుకోలేదా? అసలిట్లా ప్రతిమాటనీ తప్పు పడితే నేనూరుకోను. వచ్చే అసెంబ్లీ నాటికి మా నిఘంటువు మేము తయారు చేసుకుంటాం. సన్నాసి అంటే సర్వదృష్టి కలవాడని, స్వార్థం లేని వాడనీ అర్థం. అట్లాగే వెధవ కోర్నాసి లాంటి పదాలక్కూడా పెడార్థాలు తీస్తున్నారు.’’
‘‘ఇక మీద పదార్థాలే తీసుకుంటాం గానీ, మాతృభాషలో సరే గణితంలో కూడా మీ అంకెలు, మీ లెక్కలు వేరే ఉన్నాయా?’’
‘‘ఇదేం వాగుడు?’’
వాగుడు అంటే వాక్ మీంచి వచ్చిన సంస్కార వంతమైన సంస్కృత శబ్దంగా గ్రహింతురు గాక!
‘‘ఎన్నికలప్పుడు ఉద్యమంలో బలిదానాల వారి మొత్తం నాలుగు సంఖ్యల్లో చెప్పారు. ప్రతి సభలోనూ సత్యాలూ సంఖ్యలూ అనగా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వల్లిస్తూ వచ్చారు కనుక, అవి విన్న కరెంటు స్తంభాలకు కూడా అవి గుర్తున్నాయి. మనం బడ్జెట్ ప్రతిపాదించే వేళకు ఆ అంకె బలహీన పడేసరికి అనుమానం వచ్చింది- ఒకవేళ మన గణితం కూడా తేడాగా ఉంటుందేమోనని...’’
‘‘అతి తెలివికి పోతే నాలిక కోస్తా. అప్పుడు అపోజిషన్‌లో ఉండి లెక్కలు తీశాం. ఇప్పుడు పొజి షన్‌లో ఉండి పక్కాగా లెక్కలు కట్టాం. సమజైందా?’’
అయింది బాబూ అయింది. ఇప్పుడు మళ్లీ తమ సొంత నిఘంటువు విప్పద్దు.
బంగారు తెలంగాణ నా లక్ష్యం!
స్వర్ణాంధ్రప్రదేశ్‌గా చేశాకే నిద్రపోతా!
ఇద్దరివీ వజ్ర సంకల్పాలే. అదేదో కథలో చెప్పి నట్టు- యజ్ఞజలంలో తడిసిన ముంగిస ఒక్కసారి బంగరు ముంగిస అయిపోయిందట. వీటిలో ఏ ఒక్కరి వజ్ర సంకల్పం ఫలించినా చాలు. ఎందు కంటే బోర్డర్ జిల్లాల మీద ఉభయ సంకల్పాలలో కామన్‌గా ఉన్న గోల్డ్ ప్రభావం పడి తీరుతుంది. అది చాలదా సామాన్యుడి బతుక్కి!
‘‘ఏందిర... వ్యంగ్యం వెలిగిస్తున్నావా? బొంద పెడతా... పోతావ్... వచ్చిన కాడికి పోతావ్...!’’
యాదగిరి నరసింహస్వామిని బాగా గుర్తు పెట్టుకున్నారు. ఉదారంగా వందకోట్లు దయ చేశారు.
‘‘చేస్తాం. ఇంకా చేస్తాం. దౌర్జన్యానికీ, దాష్టీకా నికీ ఎదురు నిలబడి చీల్చి చెండాడినవాడు. మా దేవుడు. ఆలిని వెతుక్కుంటూ నేలకి దిగొచ్చిన బాపతు కాదు. మరి అన్ని దిక్కుమాలిన వరాలున్న ... అవేటవి ... పగలు కాదు రాత్రి కాదు, మనిషి కాదు మృగం కాదు, లోపల కాదు బయట కాదు... ఇంత గజిబిజిని గోళ్లతో చీరేశాడు. ఇదొక సందేశం. అది మా గుట్ట మీంచి వెళ్తావుంది’’
‘‘అటు కూడా ఒక కొండ మీద ముమ్మూర్తులా ఇట్లాంటి దేవుడు ఉన్నాడు సార్! సందేశాలు అట్నించి కూడా వస్తాయేమో కదండీ!’’
‘‘నీ... నీదేదో నెలల తక్కువ పుటకలాగుందే. ఆ స్వామిని చూడడం అందరికీ సాధ్యమేనా? ఆ ఉగ్రరూపాన్ని చూడలేక, ఆ గాండ్రింపులు వినలేక గంధపు పూతలు పెట్టుకుంటూ... హు వద్దులే.
-శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ రచయిత)