ఇక అంతా రామమయం!
శ్రీరమణ
ఇది ఈ క్షేత్ర మహిమగాని, మీ తప్పు కాదు. దివ్యశక్తితో చూశాను. ఈ గడ్డ మీద ద్వాపరంలో కురుసభ ఇక్కడే మొలుస్తుంది. కలియుగంలో ఆంధ్రప్రదేశ్ చట్టసభ ఇక్కడే వెలుస్తుంది. ఈ నేల నైజం వల్ల మీరిట్లా ప్రవర్తించారు.
పదండి నాయనలారా! అంటూ ముందుకు నడిపించాడు.
అప్రజాస్వామిక భాష.. అస లా కరచరణాదుల కదలికలేం టి? ఆ వెక్కిరింతలేంటి? ఆ కవ్వింపులేంటి? హ వ్వ..! ఇది దారుణం. ఇది కలికాలం! ఎక్కడ చూసి నా ఇవే వ్యాఖ్యానాలు. అందరూ ముక్కుల మీద వేళ్లేసుకుంటున్నారు. దీని కంతటికీ కారణం ప్రత్యక్ష ప్రసారాలు అన్నాడొక పెద్దమనిషి. అప్పుడూ ఇంతకంటే తక్కువేంకాదు. మైకులు విరిచెయ్యడం, పేపర్ వెయిట్లు విసురు కోవడం, కాగితాలు చింపి పారెయ్యడం మన చట్ట సభలో సర్వసాధారణం. అరుపులు, కేకలు, ఈలలు కొత్తేమీ కాదు. అయితే, అప్పుడు విషయాలు నాలు గ్గోడల మధ్యా ఉండిపోయేవి. ప్రెస్ గ్యాలరీ నుంచి విశేషాలు చక్కగా ఫిల్టరై ప్రజలు పీల్చడానికీ, ఆస్వా దించడానికీ వీలుగా బయటకు వచ్చేవి. ఇప్పుడా జల్లెడలు లేవు. పచ్చిగా బయటపడుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారాల తర్వాత తమ తమ నాయకులను సభలో తరచూ చూస్తూ ఉండటంవల్ల వారిని గుర్తిం చి ఓటర్లు గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. వీరినా నేను నా పవిత్రమైన ఓటుతో గెలిపించిందని త్రికరణశుద్ధిగా దిగులు పడుతున్నారు. వేడి వాడి నిట్టూర్పులతో సమా వేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ ఉంటారు.
త్రేతాయుగంలో విశ్వామిత్రుడు యాగ రక్షణ నిమి త్తం రామలక్ష్మణులను వెంట తీసుకుని తన ఆశ్రమానికి బయలుదేరాడు. వారు ముగ్గురూ అరణ్యంలో అలా నడిచి వెళుతుంటే మూడు పడగల నాగుపాము వెళుతు న్నట్టుందని కవిగాయకులు గానం చేశారు. వేళ మిట్ట మధ్యాహ్నమైంది. ఉన్నట్టుండి లక్ష్మణుడు విశ్వామిత్రు డికి ఎదురు నిలిచి, ఏం రుషివి! నువ్వుత్త బోడి రుషివి! ఇద్దరు రాక్షస వెధవలని ఎదిరించలేని వాడివి ఈ యాగం తలపెట్టడం దేనికి? హాయిగా తిని తిరిగే మమ్మల్ని అడవులకు అడ్డం పడేసి తేవడం దేనికి? అం టూ తుపుక్కున ఉమ్మేశాడు. విశ్వామిత్రుడు నిశ్చేష్టుడై నాడు. రాముడందుకుని, ‘‘మహర్షీ! నువ్వు వాజమ్మవి. మా తండ్రి పరమ వీర దద్దమ్మ!’’ అనగానే రుషి తల తిరిగిపోయింది. ‘‘ఇక్ష్వాకు కుల తిలకా! రామ భద్రా! నీవేనా...ఈ...’’ ‘‘ఔను నేనే. కౌశికా! నువ్వొక భ్రష్ట యోగివని మా గురువు వశిష్టుల వారు ఎప్పుడో చెప్పా రు. నా తండ్రి పిరికిపంద...’’ రాముడి మాటలు వినిపించుకోకుండా విశ్వామిత్రుడు అంగలార్చు కుంటూ ముందుకు సాగాడు. రామలక్ష్మణులు తిట్ల దండకం కొనసాగిస్తూ అనుసరించారు. మార్గమ ధ్యంలో ఒకచోట సన్నటి వాగు సరిహద్దు రేఖలా ప్రవహిస్తోంది. దాన్ని దాటగానే రామలక్ష్మణులను ఆవహించిన శక్తేదో దిగిపోయినట్టయింది. వారి ద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకుని బేషరతుగా మహర్షి కాళ్ల మీద పడ్డారు. రుషి చిరునవ్వుతో వారి ని దువ్వి, ఇది ఈ క్షేత్ర మహిమగాని, మీ తప్పు కాదు. దివ్యశక్తితో చూశాను. ఈ గడ్డ మీద ద్వాపరం లో కురుసభ ఇక్కడే మొలుస్తుంది. కలియుగంలో ఆంధ్రప్రదేశ్ చట్టసభ ఇక్కడే వెలుస్తుంది. ఈ నేల నైజం వల్ల మీరిట్లా ప్రవర్తించారు. పదండి నాయన లారా! అంటూ ముందుకు నడిపించాడు. ప్రచారం లో ఉన్న గాథలలో ఇదొకటి. మరి రేపు న్యూ క్యాపి టల్ వచ్చినా ఇంతేనా- అని సందేహం వచ్చింది కొందరికి. అది సింగపూర్ వాస్తు, జపాన్ టెక్నాలజీ లతో నిర్మితమవుతోంది. అక్కడి సభా ప్రాంగణా లలో ప్రత్యేక సదుపాయాలుంటాయి. అసభ్య, అశ్లీల పదజాలమంతా మధురమైన రామనామంగా హాయిగా వినవస్తుంది. ఇక అప్పుడు ‘‘రామా!’’ అంటే బూతనీ, ‘‘శ్రీరామా’’ బండబూతనీ ప్రేక్షక శ్రోతలు అర్థం చేసుకో వాలి. అయితే, రికార్డ్స్ కోసం ఒక్క సభాపతికి మాత్రం ఆ మహా సూక్తులు యథాతథంగా వినిపిస్తాయి. ఎం తైనా వారు గౌరవనీయులు కదా! కల్యాణ శుభవేళ రాముడు అందరినీ అనుగ్రహించుగాక!
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)