గ్రహం అనుగ్రహం ( 08-07-2015 )
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం, తిథి బ.సప్తమి సా.5.56 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం ఉత్తరా భాద్ర రా.7.36 వరకు, వర్జ్యం ఉ.6.15 నుంచి 7.45 వరకు, దుర్ముహూర్తం ప.11.38 నుంచి 12.28 వరకు, అమృతఘడియలు ప.3.10 నుంచి 4.40 వరకు
సూర్యోదయం : 5.34
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం:ఉ.7.30 నుంచి 9.00 వరకు
భవిష్యం
మేషం: పనుల్లో ఆటంకాలు ఉండే అవకాశం ఉంది. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.
వృషభం: బంధువులతో సఖ్యత. విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
మిథునం: నూతన ఉద్యోగ ప్రాప్తి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవచింతన.
కర్కాటకం: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా బాధ్యతలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆలయాలను సందర్శిస్తారు.
సింహం: మిత్రులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.
తుల: దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి.
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. రుణాలు చేయాల్సివస్తుంది. పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
ధనుస్సు: రాబడికి మించి ఖర్చులుండవచ్చు. దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మకరం: కుటుంబ సౌఖ్యం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. బంధువుల నుంచి ధన లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.
కుంభం: ముఖ్యమైన పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. రుణదాతల ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది.
మీనం: సభలు, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
- సింహంభట్ల సుబ్బారావు