ఒంటరి పాట
నువ్వు చూసి చాలా కాలమే అయింది
నిన్ను వినక ఎన్నో రోజులైంది
ఔనూ... నీకు తెలియదు కదా!
లేత మామిండ్లకు వయసు మీరిందని
యజమాని తోటను కొట్టించాడు
మాఘమాస జాతర మరలిపోయింది
తోట అంచు నది తరలిపోయింది
చేపలూ పక్షులూ చెల్లాచెదురైనవి
ప్రవాహానికి వంగిన గరికపోచ
లేచి నిలబడిందన్న వార్త వాస్తవమే కానీ
పచ్చదనాన్ని కోల్పోయిందన్నది పుకారు కాదు
ఠి మద్దికుంట లక్ష్మణ్
9441677373