కశ్మీరీలు, ఆదివాసీలు భారతీయులు కారా? | why Kashmirans and tirbals will not count as indians ? | Sakshi
Sakshi News home page

కశ్మీరీలు, ఆదివాసీలు భారతీయులు కారా?

Published Sun, Jul 17 2016 2:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

కశ్మీరీలు, ఆదివాసీలు భారతీయులు కారా?

కశ్మీరీలు, ఆదివాసీలు భారతీయులు కారా?

దేశంలో జరుగుతున్న అన్ని ప్రతిఘటనా పోరాటాలను మన డ్రాయింగ్ రూముల్లో, టీవీల ముందు కూర్చుని ఉగ్రవాదం అని పిలిచేస్తుంటాం. కశ్మీరీలను, ఆదివాసీలను, ఈశాన్య గిరిజనులను భారతీయులుగా పరిగణించడం లేదు. అక్కడ జరిగే హింస మనల్ని ఏమాత్రం స్పృశించడం లేదు. అందుకే ఆ హింసకు కారణాలను, వాటి పరిష్కారాలను మనం చాలా సులువుగా దాటేస్తుంటాం. దీనివల్ల్లే కేంద్ర ప్రభుత్వం ప్రతిఘటిస్తున్న వారిపట్ల తాను కోరుకుంటున్నంత కఠినంగా, నిర్దయగా వ్యవహరిస్తోంది.

దీర్ఘకాలంగా కొనసాగుతున్న మూడు అతి పెద్ద ఘర్షణాత్మక ప్రాంతాలను భారత్ కలిగి ఉంటోంది. మొదటిది జమ్మూ కశ్మీర్. రెండు, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలతో కూడిన మధ్యభారత ఆదివాసీ ప్రాంతం.  మూడు, ఈశాన్య భారత్‌లోని గిరిజన ప్రాంతం. మొదటి ప్రాంతంలో సమస్య ఏమిటంటే, దేశ విభజన సమయంలో తమ వాణిని ఎవరూ పట్టించుకోలేదని కశ్మీర్ ముస్లి ములు భావిస్తున్నారు. ప్లెబిసైట్ (తామేం కోరుకుంటున్నారు అనే అంశంపై నిర్వహించే రిఫరెండం)పై నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తమకు చేసిన వాగ్దానం వెనుక్కు తీసుకున్నారని వీరి ఆరోపణ.

పలు చర్యల పరంపర ద్వారా జమ్మూకశ్మీర్‌ను తర్వాత భారత సమాఖ్యలో కలిపేశారు, కాని వీటిని కశ్మీ రీలు చట్టబద్ధమైనవిగా ఆమోదించడం లేదు.  ఐక్యరాజ్యసమితి మొదట్లోనే ఈ సమస్యలో తలదూర్చింది. కానీ, ప్రచ్ఛన్న యుద్ధం, చీలిపోయిన భద్రతా మండలి ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది. అందుకే కశ్మీరీలు సరిగ్గా 3 దశాబ్దాల క్రితం హింసాత్మక తిరుగుబాటుకు సిద్ధపడ్డారు. బలమైన సైన్యం నీడలో రెండు తరాల కశ్మీరీలు ఎదిగారు. కశ్మీర్‌లోయలోని హిందువులు వలస వెళ్లిపోయారు. కానీ కశ్మీర్ వేర్పాటువాద హింస ఆ రాష్ట్రాన్ని దాటి వెళ్లలేదు. ఈ అన్ని దశాబ్దాలలోనూ ముంబై లేదా ఢిల్లీపై కశ్మీరీలు బాంబు పేలుళ్లకు, దాడులకు దిగలేదు. ఆయుధాలు చేపట్టిన కశ్మీరీలు వాటిని రాష్ట్ల్రంలోనే భారత సాయుధ బలగాలపైనే ఉపయోగించారు. తక్కిన భారత్ మొత్తంగా వీరిని ఉగ్రవాదులుగా చూస్తున్నప్పటికీ, కశ్మీరీలు మాత్రం వారిని అలా చూడలేదు.

 పాకిస్తాన్ నుంచి ప్రోత్సాహం లేనట్లయితే కశ్మీర్ ఒక సమస్యగా ఉండదని భారత్ భావన. అయితే కశ్మీరీలపై సాగుతున్న తీవ్ర హింసను చూస్తుంటే వారిని భారతీయులుగా మనం చూడలేదనిపిస్తోంది.
 ఇకపోతే, రెండో ఘర్షణాత్మక ప్రాంతంలో సాంప్రదాయిక ఆదివాసీ ప్రాంతా ల్లోని వనరులను కొల్లగొట్టడమే సమస్య. ఈ ప్రాంతంలో సమృద్ధిగా ఖనిజాలు, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం ఈ వనరులను జాతీయ సంపదగా భావించి వాటిని తోడేయాలని కోరుకుంటోంది. అయితే ఆదివాసీల భూములను కైవసం చేసుకుంటున్న మనం వారిపట్ల న్యాయంగా వ్యవహరించడం లేదు. భారత్ సమర్ధత ఉన్న ప్రాంతం కాదు. సంపన్న ప్రాంతమూ కాదు. భారత్‌లోని మెజారిటీ జనాభాకు, ప్రత్యేకించి పేదలకు ప్రభుత్వం విద్యను, ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో అందించలేదు.

కానీ భారత జనాభాలో 8 శాతంగా ఉన్న ఆదివాసీల విషయానికి వస్తే మాత్రం వారు త్యాగం చేయాలని నొక్కి చెబుతుంటారు. నిజం చెప్పాలంటే ఆదివాసీ భూముల్లోంచి తోడివేసిన బొగ్గు ద్వారానే మన నగర ప్రాంతాల్లో ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషిన్లు పనిచేస్తున్నాయి. వారు నివ సిస్తున్న అడవులనే న రికి వాటిని కలుషితం చేస్తున్నాం. పైగా బొగ్గు గనులను దక్షిణ ముంబై, దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో కనుగొన్నట్లుగా ఇక్కడి మానవహక్కులు, దోపిడీ, పర్యావరణం గురించి మరింతగా చర్చిస్తామని మనకు హామీ ఇస్తుం టారు కానీ, ఆదివాసీలు తమ హక్కుల కోసం జరిపే పోరాటంలో వారికి మద్ద తుగా నిలిచే మిత్రపక్షాలు ఏమంత ఎక్కువగా లేకపోవడం విచారకరం.
 
 దోపిడీకి వ్యతిరేకంగా సాగించే హింసాకాండను మనదేశంలో మావోయిజం లేదా వామపక్ష తీవ్రవాదం అని పిలుస్తున్నారు. ఇలా ముద్రవేయడం ద్వారా ఈ రకం హింసకు దారితీస్తున్న కారణాలను నగర భారతీయులు విస్మరించేలా చేసి మావోయిస్టులను ఉగ్రవాదులుగా ఆమోదించేయడం చాలా సులువైన పని. ఈ ఒక్క కారణం వల్లే తీవ్రవాది, ఉగ్రవాది, మావోయిస్టు, జిహాదిస్టు వంటి పదాలు మన నోళ్లలో అలవోకగా నానుతుంటాయి. కశ్మీర్ హింసలాగే మావోయిస్టు హింస కూడా చెన్నయ్ లేదా కోల్‌కతాకు చేరడం లేదు. ఈ హింస ఆదివాసీ ప్రాంతానికే పరిమితం అయింది. మన నగరాల్లో మందుపాతరలు పేలవు. కార్పొరేట్ ఆఫీసు లను ఎవరూ ముట్టడించరు.
 
 ఇక మూడో ఘర్షణాత్మక ప్రాంతం ఈశాన్య భారత్. ఇది మొఘల్ పాలన కిందికి రాని భారత్‌లోని భాగం. బ్రిటిష్ పాలకులు వీరిని లోబర్చుకున్నారు. ఈ ప్రాంతాన్ని  ఇటీవలి కాలంలోనే భారత్‌లో కలిపేశారు. ఈ ప్రాంతంలోని కొన్ని ఆదివాసీ తెగలు 1947కి చాలాకాలం క్రితమే తమను ఇండియాలో కలిపేయడాన్ని ప్రతిఘటించాయి. వీరు తర్వాత కూడా తమ హింసను కొనసాగించారు. బలంగా పాతుకుపోయిన భారత సైన్యం ఇక్కడి ప్రతిఘటనను చల్లబర్చింది.
 
 కానీ ఈశాన్య భారత్‌లోని తిరుగుబాటుదారులు కూడా తమ పోరాటాన్ని బెంగళూరు, లేదా హైదరాబాద్‌లో చేయడం లేదు. మన విమానాశ్రయాలపై ఎలాంటి దాడులూ జరగటం లేదు, మన పాఠశాలల్లో ఎవరినీ బందీలుగా పట్టుకోవడం లేదు.  లక్షలాది కశ్మీరీలు, ఈశాన్య భారతీయులు తాము పనిచేస్తున్న భారత్‌లోని నగర కేంద్రాల్లోనే నివసిస్తున్నారు. వీరికి ఇళ్లను అద్దెకు ఇవ్వడానికి తిరస్కరించి నప్పుడు, తమ జాతి కారణంగా వీరిపై దాడులు జరిగినప్పుడు నిత్యం వార్తల్లోకి వస్తుంటారు. తమ సొంత గడ్డపై జరుగుతున్న ఘర్షణను వారు అక్కడే వదిలే శారు. అయినా మరొక దేశంలో నివసిస్తున్నవారికి లాగా.. వీరిపై దాడులు చేస్తు న్నారు, చంపుతున్నారు. మనదేశ మూడు ప్రధాన ఘర్షణాత్మక ప్రాంతాలను భార తీయ మధ్యతరగతి విస్మరించడానికి ఈ కీలక వాస్తవమే కారణం. అక్కడ జరిగే హింస మనల్ని ఏమాత్రం స్పర్శించడం లేదు. అందుకే ఆహింసకు కారణాలను, వాటి పరిష్కారా లను మనం చాలా సులువుగా దాటేస్తుంటాం.
 
మన డ్రాయింగ్ రూముల నుంచి, టీవీల నుంచి దీన్ని మనం ఉగ్రవాదం అని పిలుస్తుంటాం. ఉగ్రవాదానికి దూరంగా ఉంటాం. అలా ఉండగలిగేందుకు తగిన అదృష్టవంతులం మరి. ఈ పరిస్థితి వల్లే ప్రభుత్వం ప్రతిఘటిస్తున్న వారి పట్ల తను కోరుకుంటున్నంత స్థిరంగా, కఠినంగా వ్యవహరి స్తోంది. కారణం ఒకటే. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు మనపై నేరుగా ప్రభావం చూపడం లేదు.
 వ్యాసకర్త కాలమిస్టు, రచయిత  aakar.patel@icloud.com
 - ఆకార్ పటేల్

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement