
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఏపీ ఎన్నికల్లో గొడవలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సి రామచంద్రయ్య ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల నియమావళి ఉల్లఘించారని తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టకపోతే చంద్రబాబు అరాచకాలు, అక్రమాలు ఎక్కువ అవుతాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మీద సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. చంద్రబాబు అరాచకాలకు పాల్పడుతూ.. ఇతరులను ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. వీవీప్యాట్‌ల లెక్కింపుపై ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు చంద్రబాబు అప్పుడేందుకు అప్పీలు చేయలేదని ప్రశ్నించారు.
చంద్రబాబు తన అవినీతి బయటపడతుందని భయపడుతున్నారని రామచంద్రయ్య తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక నిజాలు బయటపెట్టిస్తామని అన్నారు. చంద్రబాబు బీజేపీతో కలవడానికి మళ్లీ ప్రయత్నించారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిపై చంద్రబాబు వేలు చూపెట్టి బెదిరింపులకు దిగడం సరికాదని సూచించారు. చంద్రబాబుకు ఓటమి కళ్ల ముందు కనిపించడంతో.. అది భరించలేక ఢిల్లీకి తిరుగుతున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment