న్యూఢిల్లీ : రైలు ప్రయాణం చేసిన రైల్వేశాఖ మాజీ మంత్రి షాక్ తిన్నారు. హ్యాపీగా ఓ జ్యూస్ తాగుదామని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని ఓపెన్ చేసి అందులో బూజు ఉండటంతో అవాక్కయ్యారు. వెంటనే మీడియాను పిలిచి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైల్వే శాఖ ఎంత దారుణంగా పనిచేస్తుందో ఇది ఒక ఉదాహరణ అని తెలిపారు. రైల్వేలో ప్రయాణీకులకు అందించే ఆహార పదార్థాలు ఏమాత్రం శుభ్రంగా లేవని, పరిశుభ్రత అనే రైళ్లల్లో కొరవడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత, రైల్వే శాఖ మాజీ మంత్రి దినేష్ త్రివేది శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి బయలుదేరారు.
వెళుతూ మధ్యలో కొన్ని మంచినీళ్లు, నిమ్మరసం, జ్యూస్‌లాంటివి ఆర్డర్ చేశారు. అవి వచ్చాక ఓపెన్ చేసి చూడగా అందులో బూజు, బ్యాక్టీరియా కనిపించడంతో ఓ మీడియా చానెల్‌కు లైవ్‌లో చూపించారు. 'ఈ రోజు దసరా.. నేను నిమ్మరసం తాగుతామని ఓపెన్ చూశాను.. చూడండి లోపల ఏం ఉందో మీరే చూడండి.. ఇది మనం తాగేందుకు ఉపయోగించేది' అని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే టిక్కెట్ చార్జీలు పెంచడం తెలిసిన కేంద్ర ప్రభుత్వానికి పరిశుభ్రతను, నాణ్యమైన ఆహారపదార్థాలను అందించాలని తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైల్వే మాజీ మంత్రికి రైలులో షాక్..
Published Sun, Oct 1 2017 5:41 PM | Last Updated on Sun, Oct 1 2017 9:31 PM
Advertisement