భోపాల్ : హోరాహోరిగా సాగుతున్న మధ్యప్రదేశ్ కౌటింగ్‌లో అధికార బీజేపీకి, కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లో హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఇద్దరు రాష్ట్ర మంత్రులు వెనకంజలో ఉండగా.. కాంగ్రెస్ కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కమల్ నాథ్ ఇంటి ఆవరణలో సంబరాలు జరుపుకుంటున్నారు.
ఉదయం 10.30 : రాష్ట్రంలో హంగ్ పరిస్థిలు వచ్చే నేపథ్యంలో బీజేపీ నాయకులు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఫలితాల గురించి చర్చించనున్నట్లు సమాచారం. ఫలితాల గురించి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇది ఆరంభం మాత్రమే.. పూర్తి ఫలితాలు ఇంకా వెలువడలేదు. గెలుస్తామనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉదయం 10.50 : మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లు ఉండగా.. 116 సీట్ల సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ 116 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 99 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఉదయం 11.10 : మధ్యప్రదేశ్‌లో హస్తందే పై చేయి అవుతోంది. ఇప్పటికే 116 స్థానాల్లో లీడ్‌లో ఉన్న కాంగ్రెస్ మరిన్ని స్థానాల్లో ఆదిక్యంలోకి వచ్చే అవకాశలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలే సాధించవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీ 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఉదయం 11.45 : అధిక్యంలో కొనసాగిన కాంగ్రెస్ హవా కాస్తా తగ‍్గగా.. కమలం కోలుకుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ 115 స్థానాల్లో అధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 106 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. రసవత్తరంగా సాగుతోన్న ఈ పోరులో విజేతలేవరో తేలాలంటే మరి కాస్తా సమయం పడుతోంది.
మధ్యాహ్నం 12.10 : మధ్యప్రదేశ్ ఓటరు నాడి సులువుగా చిక్కడం లేదు. కాంగ్రెస్, బీజేపీల మధ్య రసవత్తరమైన పోరు కొనసాగుతోది. కాసేపు బీజేపీ, మరి కాసేపు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటున్నాయి. దాంతో నాయకులు కూడా ధైర్యంగా గెలుస్తామని చెప్పలేక పోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ మాజీ సీఎం బాబు లాల్ గౌర్ గెలుస్తామనుకున్నపుడు ఓడిపోవచ్చు.. కొన్ని సార్లు నిజంగానే గెలవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ 116, బీజేపీ 103 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
మధ్యాహ్నం 12.40 : మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు.. ప్రజల ఆగ్రహానికి నిదర్శమన్నారు శివసేన నాయకుడు సంజయ్ రౌత్. అయితే కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పలేమన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని అభిప్రాయ పడ్డారు. బీజేపీ నాయకుడు అమిత్ మాలవియ మాత్రం గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు సమంగా మారింది. కాంగ్రెస్ 109 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ కూడా 109 స్థానాల్లోనే లీడ్‌లో కొనసాగుతోంది.
మధ్యాహ్నం 01.10 : బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రసవత్తర పోరు కొనసాగుతుండటంతో.. రాష్ట్రంలో హంగ్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ కీలంగా మారింది. ప్రస్తుతం బీఎస్పీ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దాంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఎస్పీతో మంతనాలు జరుపుతున్నాయి.
మధ్యాహ్నం 01.40 : ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ 111 స్థానాల్లో, కాంగ్రెస్ 108 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. దానిలో భాగంగా తన పార్టీ ఎమ్మెల్యేలందరిని ఢిల్లీకి పంపించారు. 55 స్థానాల భవితవ్యం కేవలం 1000 ఓట్ల మార్జిన్ డిసైడ్ చేయనుంది.
మధ్యాహ్నం 02.00 : రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు ఉత్కంటభరితంగా సాగుతోంది. 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యిసరికే.. బీజేపీ, కాంగ్రెస్ 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment