
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. గురువారం వెలువడిన ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించడంతో కేసీఆర్ వైఎస్ జగన్‌కు స్వయంగా ఫోన్ చేశారు. జగన్ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ గెలుపుతో తెలుగు రాష్ట్ర మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment