
సాక్షి, ఒంగోలు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నేతలు, కార్యకర్తలకు పరిచయం చేశారు. రాజ్యసభ ఎన్నికలకు ఈ నెల 7వ తేదీన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్ సీపీ దేశ రాజధాని ఢిల్లీ వేధికగా మార్చి 5న ధర్నా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశమైన వైఎస్ జగన్.. ఢిల్లీలో నిర్వహించబోయే ధర్నా, ప్రత్యేక హోదా పోరాటం గురించి చర్చించి.. నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతల ఢిల్లీ యాత్రను వైఎస్ జగన్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment