ఒకే ఓవర్లో 39 పరుగులు | 39 runs in one over | Sakshi
Sakshi News home page

ఒకే ఓవర్లో 39 పరుగులు

Published Wed, Oct 2 2013 1:11 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

ఒకే ఓవర్లో 39 పరుగులు

ఒకే ఓవర్లో 39 పరుగులు

మిర్పూర్: బంగ్లాదేశ్ బౌలర్ అలావుద్దీన్ బాబు దేశవాళీ వన్డే (లిస్ట్ ‘ఎ’) క్రికెట్‌లో కొ(చె)త్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఢాకా ప్రీమియర్ డివిజన్‌లో భాగంగా మంగళవారం షేక్ జమాల్ క్లబ్, అబహాని క్లబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ విశేషం చోటు చేసుకుంది. మీడియం పేసర్ అయిన అలావుద్దీన్ (అబహాని) తాను వేసిన ఒక ఓవర్లో ఏకంగా 39 పరుగులు సమర్పించుకున్నాడు.
 
 అతని బౌలింగ్‌ను చీల్చి చెండాడిన బ్యాట్స్‌మన్ జింబాబ్వేకు చెందిన ఎల్టన్ చిగుంబురా కావడం విశేషం. జమాల్ క్లబ్ తరఫున ఆడుతున్న చిగుంబురా...ఆ ఓవర్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లు బాది 32 పరుగులు సాధించాడు. అయితే అలావుద్దీన్ మరో 2 వైడ్లు, నోబాల్ (బౌండరీ దాటింది) రూపంలో 7 పరుగులు సమర్పించుకున్నాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement