సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజియన్ ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్స్ స్కేటింగ్ మీట్‌లో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ కింగ్‌కోఠి విద్యార్థులు ఎం. బహుషిరా, రియా విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన అండర్–19 బాలబాలికల క్వాడ్ 300 మీ. ఈవెంట్‌లో వీరిద్దరూ స్వర్ణాలను సాధించారు. బాలుర విభాగంలో బహుషిరా లక్ష్యాన్ని 41.80 సెకన్లలో చేరుకొని అగ్రస్థానంలో నిలవగా, ఎస్. అవినాశ్ 47.99 సెకన్లలో ముగించి రజతాన్ని గెలుచుకున్నాడు. కాంస్యాన్ని సాధించిన రాజమండ్రి ఫ్యూచర్‌కిడ్స్ అథ్లెట్ టి. శ్రీవత్స 49.45 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్నాడు.
బాలికల విభాగంలో రియా 44.44 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి పసిడిని సాధించింది. మలక్‌పేట్ సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన సోనాలి 52.49 సెకన్లలో, ఖైరతాబాద్ ఎన్‌ఏఎస్‌ఆర్ బాలికల స్కూల్‌కు చెందిన సయేదా అయేషా ఫరీస్ 1ని. 22.85 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. ఇందిరాపార్క్ స్కేటింగ్ రింక్‌లో జరిగిన పోటీల్లో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నగర పోలీస్ అదనపు కమిషనర్ డీఎస్ చౌహాన్ ముఖ్య అతిథిగా వచ్చేసి అథ్లెట్లకు పతకాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment