త్వరలో భారత్ తో సీరిస్.. బంగ్లా జట్టుకు షాక్ | Bangladesh ODI Captain Mashrafe Mortaza Sustains Injury in Road Accident | Sakshi
Sakshi News home page

త్వరలో భారత్ తో సీరిస్.. బంగ్లా జట్టుకు షాక్

Published Thu, Jun 4 2015 3:22 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

త్వరలో భారత్ తో సీరిస్.. బంగ్లా జట్టుకు షాక్

త్వరలో భారత్ తో సీరిస్.. బంగ్లా జట్టుకు షాక్

ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ వన్డే కెప్టెన్ మష్రఫే మోర్తాజా గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మిర్పూర్ లో రోడ్డు ప్రమాదానికి గురయిన మోర్తాజా రెండు చేతులకు గాయాలయ్యాయి. బంగ్లా స్టేడియానికి జట్టు ట్రెయినింగ్ సెషన్ కోసం మోర్తాజా తన ఇంటి నుంచి రిక్షాలో బయలుదేరాడు. మార్గమధ్యలో ఓ బస్సు రిక్షాను ఢీకొట్టడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు.  మోర్తాజా ఆల్రౌండర్ గా కూడా జట్టుకు సేవల్ని అందించగల ఆటగాడు. ఒకవేళ మోర్తాజా కోలుకోకుంటే ఆ జట్టు కీపర్ స్థానాన్ని భర్తీచేయడానికి వేరొకరిని జట్టులోకి తీసుకోవాల్సి వస్తుంది.

అయితే భారత్ తో ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే 3 మ్యాచ్ ల సీరిస్కు ముందు బంగ్లా కెప్టెన్ గాయాపాలవ్వడం ఆ జట్టుకు ప్రతికూలతగా మారనుంది. ట్రై సీరిస్ సమయానికి అతడు కోలుకోవచ్చునని బంగ్లా జట్టు మేనేజ్మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. దురదృష్టవశాత్తూ మోర్తాజా గాయాలపాలయ్యాడని ఆ బంగ్లా కోచ్ చాందికా హతురసింఘా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement