శ్రీలంక భారీ స్కోరు  | Mendis, De Silva lead Sri Lanka run fest | Sakshi
Sakshi News home page

శ్రీలంక భారీ స్కోరు 

Published Sat, Feb 3 2018 12:58 AM | Last Updated on Sat, Feb 3 2018 12:58 AM

Mendis, De Silva lead Sri Lanka run fest  - Sakshi

కుశాల్‌ మెండిస్‌

చిట్టగాంగ్‌: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారిస్తున్నారు. కుశాల్‌ మెండిస్‌ (196; 22 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధనంజయ డిసిల్వా (173; 21 ఫోర్లు 1 సిక్స్‌) భారీ శతకాలు నమోదు చేశారు. రోషన్‌ సిల్వా (87 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కెప్టెన్‌ చండిమాల్‌ (37 బ్యాటింగ్‌) రాణించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి లంక 3 వికెట్ల కోల్పోయి 504 పరుగులు చేసింది.

ప్రస్తుతం బంగ్లా స్కోరుకు 9 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్‌ స్కోరు 187/1తో మూడోరోజు ఆట కొనసాగించిన మెండిస్, డిసిల్వా రెండో వికెట్‌కు 308 పరుగులు జోడించారు. అనంతరం ముస్తఫిజుర్‌ బౌలింగ్‌లో డిసిల్వా ఔట్‌ కాగా... మెండిస్‌ ద్విశతకానికి 4 పరుగుల దూరంలో తైజుల్‌ ఇస్లాంకు దొరికిపోయాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement