
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ చీఫ్
కోలకతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) కు గురువారం రాత్రి గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన్ను అత్యవసర చికిత్స మేరకు కోలకతాలోని బీ ఎమ్ బిర్లా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
తీవ్రమైన ఛాతినొప్పితో బాధపడుతుండటంతో దాల్మియాను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.