గవాస్కర్.. మీ సేవలకు థాంక్స్!
బీసీసీఐ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి ఐపీఎల్ 2014 ఇన్ఛార్జి పదవి నుంచి వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఈ బాధ్యతల్లో ఉన్నందువల్ల ఎలాంటి పనీ చేయలేని గవాస్కర్.. ఇక మీదట ఏ పనైనా నిరభ్యంతరంగా చేసుకోవచ్చని తెలిపింది. ఐపీఎల్ 2014కు గవాస్కర్ ఛైర్మన్గా వ్యవహరించగా, అది జూన్ 1వ తేదీతో ముగిసిందని సుప్రీం న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
ఐపీఎల్ ముగిసిపోయింది కాబట్టి, బీసీసీఐ పదవి విషయంలో తనకు స్పష్టత ఇవ్వాలంటూ సునీల్ గవాస్కర్ స్వయంగా సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాయడంతో, దానికి సమాధానంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్పై బెట్టింగ్ ఆరోపనలు రావడంతో శ్రీనివాసన్ను సుప్రీంకోర్టు ఆ పదవి నుంచి తప్పించి, తాత్కాలికంగా గవాస్కర్ను నియమించింది.