BCCI chief
-
వచ్చే ఏడాది ఐపీఎల్‌పై బీసీసీఐ బాస్ కీలక వ్యాఖ్యలు..
IPL 2022 Will Be Held In India Says Sourav Ganguly: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2022) భారత్‌లోనే జరగాలని కోరుకుంటున్నానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ భారత టోర్నీ అని, అందుకే భారత అభిమానులు ఈ లీగ్ స్వదేశంలో జరగాలని కోరుకుంటున్నారని అన్నాడు. 2022 సీజన్‌కు ఇంకా 8 నెలల సమయం ఉందని, అప్పటిలోగా దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ తొలి దశ మ్యాచ్‌లు భారత్‌లోనే జరిగినప్పటికీ.. కరోనా కారణంగా లీగ్ వాయిదా పడి యూఏఈకి తరలి వెళ్లింది. చదవండి: 17 ఏళ్ల తర్వాత పాక్‌లో పర్యటించనున్న టీమిండియా..! -
మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ
సాక్షి, కోలకతా: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయనకు మళ్లీ ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన కోలకతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇటీవల గుండెపోటుకు గురై , కోలుకున్న దాదా మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న వార్త క్రికెట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, గంగూలీకి మంగళవారం ఛాతీలో కొంచెం నొప్పిగా అనిపించింది. కానీ బుధవారం ఆ నొప్పి మరింత పెరగడంతో గ్రీన్ కారిడార్ ద్వారా ముందు జాగ్రత్తగా గంగూలీని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. (ఆస్పత్రి నుంచి సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్) కాగా ఇటీవల (జనవరి, 2) గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ చికిత్స అనంతరం జనవరి 7వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. స్వల్ప గుండెపోటుతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరిన గంగూలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే. (గంగూలీకి మరో రెండు బ్లాక్స్.. 24 గంటలు అబ్జర్వేషన్లోనే) BCCI Chief Sourav Ganguly being taken to Apollo Hospital in Kolkata after he complained of chest pain. More details awaited. (File photo) pic.twitter.com/e72Iai7eVz — ANI (@ANI) January 27, 2021 -
బీసీసీఐ చీఫ్ మరో ఘనత
న్యూఢిల్లీ: చిన్న వయసులో బీసీసీఐ చీఫ్ అయిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మరో ఘనత సాధించారు. మిలటరీ టెర్రిటోరియల్ ఆర్మీ (టీఏ)లో ఆయన రెగ్యులర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. 41 ఏళ్ల ఠాకూర్ శుక్రవారం విధుల్లో చేరనున్నారు. తద్వారా మిలటరీ దళంలో చేరిన తొలి బీజేపీ ఎంపీ ఆయనే కానుండటం విశేషం. చండీగఢ్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూ, పరీక్షలో ఆయన ఉత్తీర్ణులయ్యారు. టీఏలో చేరాక శిక్షణ పొందనున్నారు. ఓ ఏడాదిలో నెలరోజులు మిలటరీ శిక్షణ తీసుకున్నవారు టీఏలో వాలంటీర్లుగా పనిచేస్తారు. ఎమర్జెన్సీ పరిస్థితిలో వారు దేశం కోసం సైన్యంలో పనిచేస్తారు. అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్పూర్ నుంచి బీజేపీ తరపున లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 'నాకు మిలటరీ యూనిఫాం ధరించాలని, దేశ భద్రతలో పాలుపంచుకోవాలన్నది ఎప్పటి నుంచో కల. ఈ కల నిజమైనందుకు నాకు చాలా ఉత్సుకతగా ఉంది' అని ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు. -
దాల్మియా నేత్రాలు దానం
కోల్‌కతా: గుండెపోటుతో మరణించిన బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా నేత్రాలను దానం చేశారు. దాల్మియా చివరి కోరిక మేరకు ఆయన నేత్రాలను కోల్‌కతాలోని వన్ముక్త ఐ బ్యాంక్‌కు దానం చేశారు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ సూపర్ పవర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన దాల్మియ ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి ఐసీసీ, బీసీసీఐ అధికారులు, క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ చీఫ్
-
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ చీఫ్
కోలకతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) కు గురువారం రాత్రి గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన్ను అత్యవసర చికిత్స మేరకు కోలకతాలోని బీ ఎమ్ బిర్లా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. తీవ్రమైన ఛాతినొప్పితో బాధపడుతుండటంతో దాల్మియాను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గవాస్కర్.. మీ సేవలకు థాంక్స్!
బీసీసీఐ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి ఐపీఎల్ 2014 ఇన్‌ఛార్జి పదవి నుంచి వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఈ బాధ్యతల్లో ఉన్నందువల్ల ఎలాంటి పనీ చేయలేని గవాస్కర్.. ఇక మీదట ఏ పనైనా నిరభ్యంతరంగా చేసుకోవచ్చని తెలిపింది. ఐపీఎల్ 2014కు గవాస్కర్ ఛైర్మన్‌గా వ్యవహరించగా, అది జూన్ 1వ తేదీతో ముగిసిందని సుప్రీం న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఐపీఎల్ ముగిసిపోయింది కాబట్టి, బీసీసీఐ పదవి విషయంలో తనకు స్పష్టత ఇవ్వాలంటూ సునీల్ గవాస్కర్ స్వయంగా సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాయడంతో, దానికి సమాధానంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్‌పై బెట్టింగ్ ఆరోపనలు రావడంతో శ్రీనివాసన్‌ను సుప్రీంకోర్టు ఆ పదవి నుంచి తప్పించి, తాత్కాలికంగా గవాస్కర్‌ను నియమించింది. -
అంతరాత్మ అనుమతించింది
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పుతో బీసీసీఐ చీఫ్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్రీనివాసన్ ఈ అంశంలో తన అంతరాత్మ చాలా క్లియర్‌గా ఉందని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే పదవిని వదిలిపెట్టి పోలేదన్నారు. తన అల్లుడు, చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్‌పై ముంబై పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసినా... బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంతరాత్మ అంగీకరించిందా? అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. తాను తప్పు చేయలేదు కాబట్టి ఈ మొత్తం ఉదంతంలో నైతికతకు తావులేదని స్పష్టం చేశారు. ‘కచ్చితంగా చెబుతున్నా నేను మరో రకంగా భావిస్తే ఈ పదవిని స్వీకరించేవాడిని కాదు. ఆరంభంలో నేను ఏ మాటైతే చెప్పానో దానికే కట్టుబడి ఉన్నా. నేను తప్పు చేసి ఉంటే నా అంతరాత్మ అనుమతి ఇచ్చేది కాదు’ అని శ్రీని పేర్కొన్నారు. గురునాథ్‌పై జరిగిన విచారణలో తన ప్రమేయం లేదని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ‘విచారణ మొదలైనప్పుడు నేను బోర్డు చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్నా. ఆ తర్వాత ఇద్దరు జడ్జిల కమిటీని బీసీసీఐ వర్కింగ్ కమిటీ నియమించింది. ఇందులో నా ప్రమేయం లేదు. కమిటీ ఇచ్చిన నివేదికను కూడా చూడలేదు. శ్రీశాంత్ కేసును కమిటీతో పాటు రవి సవానీ విచారించారు. వీళ్ల కార్యక్రమాలు, ఎన్ని సమావేశాలు జరిగాయో కూడా నాకు తెలియదు’ అని శ్రీనివాసన్ వివరించారు.