ఫ్రాంఛైజీ సొంతం చేసుకున్న హీరో | Bengali cinestar Jeet has acquired the Kolkata franchise PFL | Sakshi
Sakshi News home page

ఫ్రాంఛైజీ సొంతం చేసుకున్న హీరో

Published Wed, Jul 6 2016 3:27 PM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

ఫ్రాంఛైజీ సొంతం చేసుకున్న హీరో

ఫ్రాంఛైజీ సొంతం చేసుకున్న హీరో

న్యూఢిల్లీ: త్వరలో భారత్లో జరుగనున్న కొత్త ఫుట్ బాల్ లీగ్ లో భాగంగా కోల్ కతా ఫ్రాంఛైజీని ఓ హీరో సొంతం చేసుకున్నాడు.  భారత్ లో ముఖ్యంగా బెంగాల్ లోనే ఈ ఆటకు ఆధరణ ఎక్కువగా ఉంటుంది. బెంగాలీ నటుడు జీత్ మల్టీ నేషనల్ ప్రీమియర్ ఫస్టల్ లీగ్ (పీఎఫ్ఎల్)లో కోల్ కతా  జట్టులో భాగస్వామిగా చేరాడు.  జట్టు పేరు 'కోల్ కతా 5ఎస్'. ఇతర జట్ల పేర్లు కూడా అదే తీరుగా ఉంటాయి. 'ఈ 5-ఎ సైడ్' అనే పేరుతో పిలవబడే ఈ లీగ్ జూలై 15వ తేదీ నుంచి 24 వ తేదీ వరకూ కొనసాగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం దాదాపు 21 దేశాలకు చెందిన 50 మంది ఆటగాళ్లు పాల్గొనున్నారు.

కొనుగోలు జరిగిన రెండో ఫ్రాంఛైజీ కోల్ కతా. కాగా ఇప్పటివరకూ చెన్నై ఫ్రాంఛైజీని మాత్రమే కొనుగోలు చేశారు. కోల్ కతా జట్టును ఆధరించాలని నటుడు జీత్ విజ్ఞప్తి చేశాడు. తమ జట్టుకు మద్దతివ్వడంతో పాటు భారత్ లో ఫుట్ బాల్ గేమ్ మరింత ప్రాచుర్యం పొందేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చాడు. ప్రతి జట్టులోనూ జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండటంతో విదేశీ అభిమానులు కూడా మ్యాచ్ లకు తరలి వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

పోల్

Advertisement