చైనా లీగ్ కన్నా బాగుంది | Better than the Chinese League | Sakshi
Sakshi News home page

చైనా లీగ్ కన్నా బాగుంది

Published Tue, Aug 20 2013 3:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

Better than the Chinese League


 ముంబై: గాయం కారణంగా ఇప్పటిదాకా బరిలోకి దిగకపోయినప్పటికీ ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)పై ప్రపంచ నంబర్‌వన్ షట్లర్ లీ చోంగ్ వీ ప్రశంసలు కురిపించాడు. ప్రతిష్టాత్మకమైన చైనా లీగ్ కన్నా ఐబీఎల్ చాలా మెరుగ్గా ఉందని అన్నాడు. ‘నేను గతంలో రెండు సార్లు చైనా లీగ్‌లో పాల్గొన్నాను. చైనా లీగ్ ఆరు నెలలకు పైగా సుదీర్ఘంగా జరుగుతుంది. కానీ ఐబీఎల్ కేవలం మూడు వారాల్లో పూర్తవుతుంది. ముంబై మాస్టర్స్ తరఫున నాతోపాటు టిన్ బాన్, మార్క్ జ్వీబ్లర్, ఇవనోవ్ ఆడుతున్నారు. వచ్చే ఏడాది ఈ లీగ్ మరింత బావుంటుందని అనుకుంటున్నాను. నేడు (మంగళవారం) తొలి మ్యాచ్ ఆడబోతున్నాను. దీంట్లో నేను గెలవడం జట్టుకు చాలా ముఖ్యం’ అని లీ చోంగ్ వీ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement