సచిన్ X గవాస్కర్
ఏదో ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ కోసం కాదు... ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)ను నిర్వహించేందుకు ఈ క్రికె ట్ దిగ్గజాలు పోటీ పడుతున్నారు. వివరాల్లోకి వెళితే ఐబీఎల్ తొలి సీజన్ విజయవంతమైనా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్), నిర్వాహకుల మధ్య విభేదాల కారణంగా ఆగిపోయింది. దీంతో రెండో సీజన్ జరగలేదు. మళ్లీ ఈ లీగ్‌ను పునఃప్రారంభించేందుకు ‘బాయ్’ ప్రణాళికలు సిద్ధం చేసింది. జనవరి 1 నుంచి 18 వరకు టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో ఉంది.
దీంతో లీగ్ నిర్వహణ కోసం బిడ్‌లను ఆహ్వానించింది. మొత్తం 15 బిడ్‌లు వచ్చాయి. ఇందులో గవాస్కర్, సచిన్‌లకు చెందిన స్పోర్టింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి. గతంలో ఉన్న జట్లను, ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేసి కొత్త జట్లతో ఐపీఎల్ పునఃప్రారంభమవుతుంది. మరి దీని హక్కులు ఎవరు గెలుచుకుంటారనేది మూడు, నాలుగు రోజుల్లో తేలనుంది.