
భవాన్స్ న్యూ సైన్స్ కాలేజికి టైటిల్
ఓయూ బాక్సింగ్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ఇంటర్ కాలేజి పురుషుల బాక్సింగ్ టోర్నమెంట్‌లో భవాన్స్ న్యూ సైన్స్ కాలేజి (విఠల్‌వాడి) జట్టు టీమ్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఆ జట్టు ఓవరాల్‌గా తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భవాన్స్ కాలేజి (సైనిక్‌పురి) జట్టు ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా... సర్దార్ పటేల్ (ఎస్‌పీ) కాలేజి ఆరు పాయింట్లతో మూడో స్థానం పొందింది. ఫలితాలు ఇలా ఉన్నాయి.
ఫైనల్స్ ఫలితాలు: లైట్ ఫ్లయ్ వెయిట్: 1. అన్‌స్లిమ్ రాజ్ (భవాన్స్ న్యూ సైన్స్ కాలేజి), 2.పి.ఉపేందర్ (బద్రుకా కాలేజి). ఫ్లయ్ వెయిట్: 1. సి.సున్నీ (వీవీ కాలేజి), 2.పి.సునీల్ కుమార్ (ఎస్‌పీ కాలేజి). బాంటమ్ వెయిట్: 1.లలిత్ (నిజాం కాలేజి), 2.పి.మహేందర్ (బద్రుకా కాలేజి). లైట్ వెల్టర్ వెయిట్: 1.జి.సాయి కుమార్ (భవాన్స్ న్యూ సైన్స్ కాలేజి), 2.డి.సత్యం (ప్రగతి కాలేజి). వెల్టర్ వెయిట్: 1.సురేందర్ (భవాన్స్ న్యూ సైన్స్ కాలేజి), 2.కార్తీక్ (కేశవ మోమోరియల్ కాలేజి). మిడిల్ వెయిట్: 1.కె.పురుషోత్తమ్ (సికింద్రాబాద్ పీజీ కాలేజి), 2.హెచ్.ఎ.రెహ్మాన్ (ఎస్‌పీ కాలేజి). లైట్ హెవీ వెయిట్: 1.సాయి కిరణ్ (స్వాతి ఇంజనీరింగ్ కాలేజి), 2.సుమీత్ (ఇంటర్నేషనల్ కాలేజి). హెవీ వెయిట్: 1.సాయి కిరణ్ (సెయింట్ ఆంథోనీ కాలేజి), 2. శ్రీకాంత్ (సెయింట్ మార్టిన్ కాలేజి). సూపర్ హెవీ వెయిట్: 1.త్రివిక్రమ్ దేవ్ (భవాన్స్ కాలేజి), 2.నితిన్ కాంత్(హోలీ మదర్ కాలేజి).