జింఖానా, న్యూస్‌లైన్: బ్రిలియంట్ చెస్ టోర్నీ జూనియర్స్ విభాగంలో నందిత (రవీంద్ర భారతి స్కూల్, విద్యానగర్ కాలనీ) టైటిల్ కైవసం చేసుకుంది. బ్రిలియంట్ చెస్ అకాడమీ నిర్వహించిన ఈ టోర్నీలో ఆదివారం జూనియర్ విభాగంలో నందిత, విశ్వజిత్ అరవింద్‌ల మధ్య జరిగిన ఆరో రౌండ్ గేమ్ డ్రా అయ్యింది. దీంతో ఇరువురు చెరో ఐదున్నర పాయింట్లతో సమంగా నిలిచారు.
అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా నందితను విజేతగా ప్రకటించారు. విశ్వజిత్‌కు రెండో స్థానం, బిపిన్ రాజ్‌కు మూడో స్థానం లభించింది. ఓపెన్ కేటగిరీలో దీప్తాంశ్ రెడ్డి 6-5 తేడాతో చక్రవర్తి రెడ్డిని ఓడించి మొదటి స్థానంలో నిలిచాడు. వరుణ్ , వినయ్ కుమార్ వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు.
మిగిలిన ఫలితాలు
అండర్-14 బాలుర విభాగం: 1. విశ్వజిత్ అరవింద్, 2. బిపిన్ రాజ్; అండర్-12 బాలురు: 1. వరుణ్ గోపాల్, 2. సాక్షేష్; బాలికలు: 1. మనస్విని, 2. నియతి; అండర్-10 బాలురు: 1. అభినవ్, 2. కుల్‌ప్రీత్; బాలికలు: 1. వర్షిత, 2. నక్షత్ర; అండర్-8 బాలురు: 1. శ్రీథన్ సపూరి, 2. ప్రభవ్; బాలికలు: 1. దివ్య , 2. త్రిష; అండర్-6 బాలురు: 1. ప్రణీత్, 2. హరినారాయణ, రోహిత్; బాలికలు: 1. సెవిత విజు, 2. హాసిని.
చెస్ చాంప్ నందిత
Published Mon, Sep 16 2013 12:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
Advertisement
Advertisement