Bharthi school
-
వడోదరా స్కూల్లో బాలుడి హత్య
వడోదరా: గుజరాత్ వడోదరాలోని ఓ పాఠశాలలో బాలుడు హత్యకు గురయ్యాడు. బారన్పురా ప్రాంతంలోని భారతి స్కూల్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుడిని 9వ తరగతి చదువుతున్న దేవ్ భగవాన్‌దాస్ తాడ్వి(14)గా గుర్తించారు. గతేడాది సెప్టెంబర్‌లో గురుగ్రామ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన ఏడేళ్ల విద్యార్థి హత్యోదం తాన్ని గుర్తుచేస్తున్న ఈ ఘటనలో.. మృతుడి శరీరంపై 10 కత్తి పోట్లు ఉన్నాయి. భోజన విరామ సమయంలో తాడ్వి తన తరగతి గదికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి ఈ దారుణానికి ఒడిగట్టి, అతని మృతదేహాన్ని వాష్‌రూంలో వదిలిపెట్టి పోయారని పోలీసులు తెలిపారు. స్కూలు పక్కనే ఉన్న దేవాలయం వద్ద లభించిన ఓ బ్యాగులో పదునైన ఆయుధాలు, కారం నీళ్లతో కూడిన సీసాను పోలీసులు గుర్తించారు. తాడ్విని హత్య చేసిన తరువాత నిందితులు ఆ సంచిని అక్కడ వదిలిపెట్టి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డీసీపీ ఆర్ఎస్ భగోరా వివరాలు వెల్లడిస్తూ..శవపరీక్ష నిమిత్తం తాడ్వి మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించామని చెప్పారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కూలుకు చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. వారం క్రితమే ఈ స్కూలులో చేరిన తాడ్వి ఇక్కడ తన మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. అతని తల్లితండ్రులు ఆనంద్ పట్టణంలో నివసిస్తున్నారు. -
చెస్ చాంప్ నందిత
జింఖానా, న్యూస్‌లైన్: బ్రిలియంట్ చెస్ టోర్నీ జూనియర్స్ విభాగంలో నందిత (రవీంద్ర భారతి స్కూల్, విద్యానగర్ కాలనీ) టైటిల్ కైవసం చేసుకుంది. బ్రిలియంట్ చెస్ అకాడమీ నిర్వహించిన ఈ టోర్నీలో ఆదివారం జూనియర్ విభాగంలో నందిత, విశ్వజిత్ అరవింద్‌ల మధ్య జరిగిన ఆరో రౌండ్ గేమ్ డ్రా అయ్యింది. దీంతో ఇరువురు చెరో ఐదున్నర పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా నందితను విజేతగా ప్రకటించారు. విశ్వజిత్‌కు రెండో స్థానం, బిపిన్ రాజ్‌కు మూడో స్థానం లభించింది. ఓపెన్ కేటగిరీలో దీప్తాంశ్ రెడ్డి 6-5 తేడాతో చక్రవర్తి రెడ్డిని ఓడించి మొదటి స్థానంలో నిలిచాడు. వరుణ్ , వినయ్ కుమార్ వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. మిగిలిన ఫలితాలు అండర్-14 బాలుర విభాగం: 1. విశ్వజిత్ అరవింద్, 2. బిపిన్ రాజ్; అండర్-12 బాలురు: 1. వరుణ్ గోపాల్, 2. సాక్షేష్; బాలికలు: 1. మనస్విని, 2. నియతి; అండర్-10 బాలురు: 1. అభినవ్, 2. కుల్‌ప్రీత్; బాలికలు: 1. వర్షిత, 2. నక్షత్ర; అండర్-8 బాలురు: 1. శ్రీథన్ సపూరి, 2. ప్రభవ్; బాలికలు: 1. దివ్య , 2. త్రిష; అండర్-6 బాలురు: 1. ప్రణీత్, 2. హరినారాయణ, రోహిత్; బాలికలు: 1. సెవిత విజు, 2. హాసిని.