సామియా డబుల్ ధమాకా
జాతీయ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్
సాక్షి, విశాఖపట్టణం: తెలంగాణ అమ్మాయి సామియా ఇమద్ ఫారుఖీ జాతీయ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మెరిసింది. ఆమె బాలికల అండర్-13 సింగిల్స్, డబుల్స్‌లో టైటిల్స్ కైవసం చేసుకుంది. అండర్-13 సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సామియా 21-18, 21-12తో నాలుగో సీడ్ కవిప్రియా (పుదుచ్చేరి)పై గెలుపొందింది. డబుల్స్‌లో కవిప్రియాతో కలిసి టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సామియా జోడి 21-16, 21-7తో దుర్వ గుప్తా-ఆశి రావత్ జంటపై నెగ్గింది.