పనాజీ: అంతర్జాతీయంగా ఆదరణ కల్గిన గేమ్స్ ఏ వేదికపై జరిగినా ప్రజలు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి కొండత అండగా నిలుస్తూ ఉండటం మనకు బాగా తెలిసిన విషయం. కాగా, గోవా రాష్ట్రంలో జరప తలపెట్టిన లూసోఫోనియా గేమ్స్ ను మాత్రం అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం లూసోఫోనియా గేమ్స్ గుర్తింపు పొందిన ఈ గేమ్సను .. గతంలో పోర్చ్ గీసు కామన్ వెల్త్ గేమ్స్ గా వ్యవహరించేవారు.
గతంలో పోర్చుగీసు వారి ఆధిపత్యం చలాయించడంతో రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని గోవా స్వాతంత్ర్య సమరయోధుల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రకాంత్ కంక్రే అభిప్రాయపడ్డారు. ఆ గేమ్స్ ఇక్కడ నిర్వహించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆ దేశానికి సంబంధించిన లూసోఫోనియా గేమ్స్ ఇక్కడ ఎలా నిర్వహించాలనుకుంటున్నారని మండిపడ్డారు. గోవాను 450 సంవత్సరాలు పోర్చుగీసు వాసులు పరిపాలించారంటూ ఆక్కడి ప్రజలు అపహాస్యం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనికి సంబంధించి నవంబర్ లో జరిగే ఈ గేమ్స్ లో పాల్గొనకూడదని ఆ రాష్ట్ర ఆటగాళ్లకు ఆయన ఒక విజ్ఞాపన పత్రాన్ని పంపారు. కాగా గోవా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుదత్త్ భక్తా మాత్రం దీన్ని ఖండించారు. ఒలింపిక్స్ క్రీడలు యథావిదిగా జరుగుతాయన్నారు.