స్టోక్ మాండివిల్లె(ఇంగ్లండ్): పారా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ షిప్ లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఈనెల 8 నుంచి 13 వరకు జరిగిన టోర్నిలో 11 పతకాలు సాధించారు. ఇందులో 4 స్వర్ణం, మూడు వెండి, నాలుగు కంచు పతకాలు ఉన్నాయి. వివిధ విభాగాల్లో 8 మంది భారత క్రీడాకారులు ఫైనల్ కు చేరి రికార్డు సృష్టించారు.
ఆరు రోజుల పాటు జరిగిన టోర్నమెంట్ లో 39 దేశాలకు చెందిన 444 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు. ప్రతి రెండేళ్లకొకసారి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తారు. 2013లో డొర్ట్ మండ్ లో ఈ టోర్ని జరిగింది.
భారత్ కు పతకాల పంట
Published Mon, Sep 14 2015 8:09 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM
Advertisement