న్యూఢిల్లీ: గతేడాది చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ క్రమంగా జూలు విదుల్చుతోంది. ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్ ఆరంభం నుంచి పరాజయాల బాట పట్టిన ఈ జట్టు ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళుతోంది. తాజాగా సోమవారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 51-21 తేడాతో ఘన విజయాన్నందుకుంది.
పాయింట్ల తేడా పరంగా ఇప్పటిదాకా ఈ సీజన్‌లో ఇదే భారీ విజయం కావడం విశేషం. ఆల్‌రౌండర్ రాజేశ్ నర్వాల్ 15 రైడ్ పాయింట్లతో, కెప్టెన్ జస్వీర్ సింగ్ 9 పాయింట్లతో దుమ్ము రేపారు. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; దబాంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడతాయి.
ఢిల్లీపై జైపూర్ పంజా
Published Tue, Aug 11 2015 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM
Advertisement
Advertisement