
జొహన్నెస్ బర్గ్ : టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. గాయం కారణంగా కుల్దీప్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయినా కుల్దీప్ వార్తల్లో నిలిచాడు. మైదానం బయట కూర్చొని కుల్‌దీప్ చేసిన కొన్ని సైగలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. భారత్ విజయం ఖాయమన్న సందర్బంలో కెమెరామెన్ డగౌట్‌లో ఉన్న కుల్దీప్‌ను పదే పదే చూపించాడు. దీన్ని గమనించిన కుల్దీప్ ఫన్నీగా చేతులతో సైగలు చేశాడు. అదే సయమంలో దక్షిణాఫ్రికా డగౌట్‌లో షమ్సీ ఉన్నాడు. దీంతో ఈ సైగలపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆసైగలు ఓడిపోతున్న దక్షిణాఫ్రికాను చూపించడండి అని కుల్దీప్ చెబుతున్నాడని ఒకరంటే.. ప్రొటీస్ మరో వికెట్ కోల్పోతుంది.. మరో బ్యాట్స్‌మన్ బ్యాటింగ్ వెళ్తాడు చూడండీ అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబందించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో వైరలైన కుల్దీప్ సైగలు
Comments
Please login to add a commentAdd a comment